- Telugu News Photo Gallery Cinema photos Wildness in Tollywood Movies 2023 devara kanguva and animal update on 04 12 2023 Telugu Entertainment Photos
Entertainment: మూవీలో ఎంత క్రూరత్వం ఉంటె సినిమా ఎంత పెద్ద హిట్ అదే ఫార్మలా.!
రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది యానిమల్. డే ఒన్ 116 కోట్లతో రణ్‌బీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మార్క్ క్రియేట్ చేసింది. వామ్మో అంత యాక్షనా అని నోరెళ్లబెడుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు యానిమల్ మాత్రమే కాదు.. నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న చాలా సినిమాలు అదే పంథాలోనే కనిపిస్తున్నాయి. యానిమల్ సినిమాలో రక్తపాతం చూస్తే కళ్లు తిరుగుతాయి. ఆ చంపడంలోనూ అంత క్రూరత్వం ఏంటి.?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 04, 2023 | 10:29 PM

రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది యానిమల్. డే ఒన్ 116 కోట్లతో రణ్‌బీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మార్క్ క్రియేట్ చేసింది. వామ్మో అంత యాక్షనా అని నోరెళ్లబెడుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్.

ఇప్పుడు యానిమల్ మాత్రమే కాదు.. నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న చాలా సినిమాలు అదే పంథాలోనే కనిపిస్తున్నాయి. యానిమల్ సినిమాలో రక్తపాతం చూస్తే కళ్లు తిరుగుతాయి. ఆ చంపడంలోనూ అంత క్రూరత్వం ఏంటి.?

అన్ని వందల మందిని అలా చంపడాలు చూపించడం ఎందుకు? అంత జుగుప్స అవసరమా? అంటూ రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మొన్నామధ్య విడుదలైన లియో విషయంలోనూ ఇలాంటి టాపిక్కే ట్రెండ్ అయింది.

ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల్లోనే కాదు, రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాల్లోనూ ఇలాంటి యాక్షన్ ఇంకో రేంజ్‌లో ఉండబోతోంది. భయమంటే ఏంటో తెలియని మృగాలను భయపెట్టే వాడి కథగా దేవర రెడీ అవుతోంది. అండర్ వాటర్ సీక్వెన్స్ మాత్రమే కాదు, సినిమాలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉంటుందనే వార్తలు అందుతున్నాయి.

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు ఉంటాయని హింట్స్ అందుతున్నాయి. కంగువగా సూర్య లుక్ చూస్తేనే శత్రువులు భయంతో పరుగులు తీసేలా అనిపిస్తోంది. ఇక బరిలోకి దిగి యాక్షన్ అంటూ చేయడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో రిలీజ్ డే రోజు విట్‌నెస్ చేయాల్సిందే.

తొలి భాగం సంచలన విజయం సాధించటంతో సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. తొలి భాగం సక్సెస్‌లో ఐటమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది.





























