- Telugu News Photo Gallery Cinema photos Kannada Star Hero Yash Next Movie yash19 news Goes Viral in social media Telugu Heroes Photos
Yash 19: యష్ మూవీ అప్డేట్ పై నేషనల్ వైడ్ వెయిటింగ్.! యష్ 19పై నెట్టింట రచ్చ.
ఓపికకు కూడా ఒక హద్దుంటుంది. అది దాటాక జరిగే పరిణామాలు మరోలా ఉంటాయి. ఇప్పుడు యష్ నెక్స్ట్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏడాదిగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు కేజిఎఫ్ స్టార్. ఇదిగో అప్డేట్.. అదిగో అప్డేట్ అంటూ దోబూచులాడుతున్నారు. తాజాగా మరోసారి యష్ 19పై చర్చ మొదలైంది. మరి ఈసారైనా అప్డేట్ వస్తుందా లేదంటే ఎప్పటిలాగే జస్ట్ సోషల్ మీడియాలో సందడి చేసి వదిలేస్తారా..?
Updated on: Dec 05, 2023 | 12:45 PM

ఓపికకు కూడా ఒక హద్దుంటుంది. అది దాటాక జరిగే పరిణామాలు మరోలా ఉంటాయి. ఇప్పుడు యష్ నెక్స్ట్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏడాదిగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు కేజిఎఫ్ స్టార్.

ఇదిగో అప్డేట్.. అదిగో అప్డేట్ అంటూ దోబూచులాడుతున్నారు. తాజాగా మరోసారి యష్ 19పై చర్చ మొదలైంది. మరి ఈసారైనా అప్డేట్ వస్తుందా లేదంటే ఎప్పటిలాగే జస్ట్ సోషల్ మీడియాలో సందడి చేసి వదిలేస్తారా..? ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు యష్.

అప్పటి వరకు కన్నడ సినిమాకు మాత్రమే తెలిసిన ఈయన పేరు.. కేజిఎఫ్ తర్వాత అని ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. దానికి తగ్గట్టుగానే ప్రెజర్ కూడా 100 కాదు 1000 రెట్లు పెరిగింది. అందుకే నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచనతోనే ఏడాదిన్నర గడిపేసాడు రాకింగ్ స్టార్.

ఇప్పటికీ యష్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. కనీసం ఒక అప్డేట్ కూడా చెప్పలేదు. దానికోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యష్ 19 ట్రెండింగ్ లోకి రావడం.. అప్డేట్ ఏమైనా వస్తుందేమో అని అభిమానులు వెయిట్ చేయడం.. చివరికి ఎలాంటి అప్డేట్ లేకుండానే ఆ ట్రెండింగ్ డౌన్ అయిపోవడం కామన్ అయిపోయింది.

ఇప్పుడు మరోసారి యష్ 19 నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. దానికి తోడు లోడింగ్ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ DP పెట్టుకున్నాడు యష్. దాంతో కొత్త సినిమా అప్డేట్ వచ్చేస్తుందంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇహనో ఇప్పుడో యష్ కొత్త సినిమా కబురు రావడం ఖాయం అయిపోయింది.

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో యష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈమె చెప్పిన మాఫియా స్టోరీ యష్ కు బాగా నచ్చింది. పైగా ప్యాన్ ఇండియా మార్కెట్ నిలబడాలంటే.. మాఫియా కథను మించిన బ్యాక్ డ్రాప్ మరొకటి లేదని నమ్ముతున్నారు ఈ హీరో.

అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ మొదటి వారంలోనే అనౌన్స్మెంట్ ఇచ్చి.. ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు యష్. మరి కేజీఎఫ్ తర్వాత విన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరో నెక్స్ట్ సినిమా ఎంత పగడ్బందీగా ఉండబోతుందో చూడాలి.




