- Telugu News Photo Gallery Cinema photos What is Vijay's future plan? Will he leave films for politics?
Vijay Thalapathy: విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? సినిమాలు చేస్తారా చేయరా..?
తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా.. ఈ ప్రశ్న ఇంక అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వచ్చేసారు.. చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారాన్నే నిజం చేస్తూ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పేరు కూడా ప్రకటించారు. మరి విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? రాబోయే ఎన్నికలను టార్గెట్ చేస్తారా.. సినిమాలు చేస్తారా చేయరా..?
Updated on: Feb 07, 2024 | 3:34 PM

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పట్నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ.. వస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. అంతేకాదు.. తమిళగ వెట్రి కళగం అంటూ పార్టీ పేరు కూడా ప్రకటించారు విజయ్. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు దళపతి.

తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకు ముడి పెడుతుంటారు.. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటి ఉంటుందా..! ఇప్పుడిదే జరిగింది. పొలిటికల్ ఎంట్రీపై ఇలా చెప్పారో లేదో.. అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు విజయ్. తమిళనాట అవినీతి రాజకీయాలు జరుగుతున్నాయని గట్టిగానే స్పందించారు ఈ హీరో.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమని.. డబ్బు తీసుకుని ఓటేస్తే ఇలాగే ఉంటుందని ఈ మధ్య విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కరోజులో అయింది కాదు.. చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. టైమ్ చూసుకుని ఇప్పుడు నేను రెడీ అంటూ రంగంలోకి దిగారు విజయ్.

రాజకీయాల కోసమే ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్. ఇదిలా ఉంటే తమిళనాట కరుణానిథి, ఎంజిఆర్, జయలలిత లాంటి లీడర్స్ అందరూ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి జెండా ఎగరేసినోళ్లే.

ఇప్పుడు విజయ్‌కు తమిళుడు అనే సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. కరుణానిధి, జయలలిత చనిపోయాక ఏర్పడ్డ రాజకీయ శూన్యతను విజయ్ క్యాష్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.




