- Telugu News Photo Gallery Cinema photos ISmart Shankar scene repeats Neuralink, a company that has implanted a chip into the human brain
Ismart Shankar: ఇస్మార్ట్ శంకర్ సీన్ రిపీట్.. మనిషి మెదడుకి చిప్..
సినిమాల్లో చూపించేదంతా బయట జరిగేవేరా.. వాళ్లు కొత్తగా ఏం చూపిస్తారు.. నిజంగా జరిగిన వాటికే కాస్త సినిమాటిక్ టచ్ ఇస్తుంటారంతే..! ఏదైనా కొత్త కథల గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు సినిమాల్లో చూపించిన దాన్నే బయట చేస్తుంటారు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఇదే చేసారు. రియల్ లైఫ్ ఇస్మార్ట్ శంకర్‌ను సిద్ధం చేసారు. మరి ఆ కథేంటో చూద్దాం పదండి..
Updated on: Feb 07, 2024 | 3:53 PM

అనగనగా ఓ హీరో.. ఆ హీరో మైండ్‌లో ఓ చిప్.. ఆ చిప్‌తో మనిషిని కంట్రోల్ చేయడం.. ఇదంతా చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తుకొస్తుంది కదా..! అవును మన పూరీ జగన్నాథ్ ఐదేళ్ల కింద చేసిందే ఇప్పుడు ఎలన్ మస్క్ నిజంగా చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీని మిళితం చేసి పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర రప్ఫాడించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ పెడతారు. ఇప్పుడిదే పని ఎలన్ మస్క్ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరోలింక్ కంపెనీ చేసింది. ఓ మనిషి మెదడులో వైర్ లెస్ చిప్ అమర్చింది.

అనంతరం ఆ మనిషి మెదడు కార్యకలాపాలు గుర్తించామని.. పేషెంట్ కోలుకున్నారని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే పని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూరీ జగన్నాథ్ కూడా చేసి చూపించారు.

ఇస్మార్ట్ శంకర్‌లో రామ్, పూరి నమ్మిన కథను ఎలన్ మస్క్ నిజం చేయడం.. నిజ జీవితంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా ఉంది కదా..! మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఊహించడానికి కష్టం.

కానీ దాన్ని నిజం చేసారు మస్క్. ఇప్పుడేకంగా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు పూరీ. ఇది కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీపైనే నడుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఇదెలా ఉండబోతుందో..?




