- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna reacts to increasing remuneration after Animal Movie
Rashmika Mandanna: వారి మాట నిజం చేస్తా.. రెమ్యునరేషన్‌పై శ్రీవల్లి శపథం
సోషల్ మీడియా అన్న తర్వాత బోలెడు వార్తలు వస్తూ ఉంటాయి.. అవన్నీ పట్టించుకుంటే కూర్చుంటే ఇంక వేరే పని చేయడానికి కూడా టైమ్ దొరకదు. కానీ అప్పుడప్పుడూ ఆ వార్తలపై రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తాజాగా రష్మిక మందన్న అదే చేసారు. మరి ఆమెను అంతగా స్పందింపజేసిన ఆ న్యూస్ ఏంటి..? ఎందుకు ఆమె రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది..? సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ రష్మిక మందన్న. సాధారణంగా తమపై వచ్చే వార్తలను సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోరు.
Updated on: Feb 07, 2024 | 1:23 PM

సోషల్ మీడియా అన్న తర్వాత బోలెడు వార్తలు వస్తూ ఉంటాయి.. అవన్నీ పట్టించుకుంటే కూర్చుంటే ఇంక వేరే పని చేయడానికి కూడా టైమ్ దొరకదు. కానీ అప్పుడప్పుడూ ఆ వార్తలపై రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తాజాగా రష్మిక మందన్న అదే చేసారు. మరి ఆమెను అంతగా స్పందింపజేసిన ఆ న్యూస్ ఏంటి..? ఎందుకు ఆమె రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది..?

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ రష్మిక మందన్న. సాధారణంగా తమపై వచ్చే వార్తలను సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోరు. కానీ రష్మిక మాత్రం తనపై వచ్చే న్యూస్ చూడ్డమే కాదు.. వాటికి రిప్లై కూడా ఇస్తుంటారు. తాజాగా ఇదే చేసారు ఈ బ్యూటీ. తన రెమ్యునరేషన్‌పై వచ్చిన వార్తలపై సెటైర్లు వేసారు రష్మిక మందన్న.

యానిమల్ విజయంతో రష్మిక మందన్న రెమ్యునరేషన్ భారీగా పెంచేసారని.. ఒక్కో సినిమాకు 4 నుంచి 4.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని రష్మికపై ఓ మీడియా సంస్థ ఆర్టికల్ రాసింది.

దానికి ఆమె రియాక్ట్ అవ్వడమే కాదు.. సెటైర్లు కూడా వేసారు. తనకే తెలియకుండా తన రెమ్యునరేషన్ అంత పెరిగిందా అంటూ రిప్లై ఇచ్చారు.. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఒక్కో సినిమాకు అంత తీసుకుంటున్నానని ఎవరు చెప్పారు.. ఆశ్చర్యంగా ఉందే.. ఇవన్నీ చూసాక నిజంగా రెమ్యునరేషన్‌పై ఆలోచించాలేమో.. నిర్మాతలు ఎందుకని అడిగితే.. మీడియా అలా చెప్తుంది.. మరి వాళ్ల మాట నిజం చేయాలిగా అని చెప్పాలేమో అంటూ సెటైర్లు వేసారు రష్మిక మందన్న. ప్రస్తుతం పుష్ప 2తో పాటు గాళ్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.




