- Telugu News Photo Gallery Cinema photos War of words between director Sandeep Reddy Vanga and legendary lyricist Javed Akhtar is intensifying.
Animal: సందీప్, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, లెజెండరీ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. యానిమల్ సినిమా మీద జావెద్ విమర్శలు చేయటంతో మొదలైన రచ్చ ఇప్పుడు పీక్స్‌కు చేరింది. మరోసారి సందీప్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు జావెద్. యానిమల్ సినిమాలో వైలెన్స్‌తో పాటు విమెన్‌ను పోట్రే చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపించాయి.
Updated on: Mar 19, 2024 | 9:15 AM

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, లెజెండరీ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. యానిమల్ సినిమా మీద జావెద్ విమర్శలు చేయటంతో మొదలైన రచ్చ ఇప్పుడు పీక్స్‌కు చేరింది. మరోసారి సందీప్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు జావెద్.

యానిమల్ సినిమాలో వైలెన్స్‌తో పాటు విమెన్‌ను పోట్రే చేసిన తీరు మీద చాలా విమర్శలు వినిపించాయి. ఆ మధ్య బాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఈ కామెంట్స్ వైరల్ కావటంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

జావెద్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన సందీప్... ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న కంటెంట్ గురించి చూసుకోండి అన్నారు. 'మీ అబ్బాయి ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూశారా..? ఎన్ని రకాల బూతులు ఉంటాయో... అవన్నీ ఆ సిరీస్‌లో ఉంటాయి' అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

తాజాగా సందీప్ రిప్లై మీద రియాక్ట్ అయ్యారు జావెద్. '53 ఏళ్ల కెరీర్‌లో నేను చేసిన ఒక్క తప్పు కూడా దొరక్క, నా కొడుకు నిర్మించిన ప్రాజెక్ట్‌ను ఉదాహరణగా తీసుకున్నావా?' అంటూ సెటైర్ వేశారు. ఓ సినిమా మీద ఒపీనియన్ చెప్పే హక్కు తనకు ఉందన్నారు జావెద్.

స్టార్స్ చేస్తున్న విమర్శల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్లు ఇస్తున్న సందీప్ రెడ్డి వంగా, జావెద్ లేటెస్ట్ కామెంట్స్ మీద ఎలా రియాక్ల్ అవుతారో చూడాలి. ఈ చిత్రానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రానుంది. ఇది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.




