- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda working with Sid Sriram again in Family Star movie
Vijay Deverakonda: మళ్లీ అదే మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ.. ఈ సారి సమ్‌థింగ్ స్పెషల్
హీరోలకి దర్శకులతో, హీరోయిన్లతో హిట్ కాంబినేషన్స్ ఉండటం పెద్ద విషయం కాదు. కానీ సింగర్స్‌తో క్లాసిక్ కాంబినేషన్ ఉంటే మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఒకప్పుడు అలాంటి బాండింగ్ ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్‌తో రిపీట్ అవుతుంది. తాజాగా ఈ కాంబోలో మరో మ్యాజికల్ సాంగ్ వచ్చింది. విజయ్, సిద్ కాంబినేషన్‌పై స్పెషల్ స్టోరీ. ఈ రోజుల్లో పాట వినగానే ఇన్‌స్టంట్ హిట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ విషయంలో ప్రతీసారి జరుగుతుంది.
Updated on: Feb 08, 2024 | 9:58 PM

హీరోలకి దర్శకులతో, హీరోయిన్లతో హిట్ కాంబినేషన్స్ ఉండటం పెద్ద విషయం కాదు. కానీ సింగర్స్‌తో క్లాసిక్ కాంబినేషన్ ఉంటే మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఒకప్పుడు అలాంటి బాండింగ్ ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్‌తో రిపీట్ అవుతుంది. తాజాగా ఈ కాంబోలో మరో మ్యాజికల్ సాంగ్ వచ్చింది. విజయ్, సిద్ కాంబినేషన్‌పై స్పెషల్ స్టోరీ..

ఈ రోజుల్లో పాట వినగానే ఇన్‌స్టంట్ హిట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ విషయంలో ప్రతీసారి జరుగుతుంది. ఈ కాంబోలో పాట వచ్చిందంటే చాలు.. చార్ట్‌బస్టర్ పక్కా. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి విడుదలైన నంద నందనా సాంగ్‌కు అదే రెస్పాన్స్ వస్తుంది.

గతంలోనూ విజయ్, సిద్ కాంబినేషన్‌లో చాలా పాటు వచ్చాయి. ఖుషీలో ఆరాధ్య పాట కూడా చాలా రోజులు ట్రెండింగ్‌లో ఉండిపోయింది. ఇక లైగర్ ఫ్లాప్ అయినా.. అందులో సిద్ శ్రీరామ్ పాడిన కలలో కూడా అంటూ సాగే పాట మంచి హిట్ అయింది. ఇక డియర్ కామ్రేడ్‌లోనూ కడలల్లే వేచె మనసే పాట బంపర్ హిట్ అయింది.

టాక్సీవాలాలో మాటే వినదుగా సాంగ్ కూడా అంతే. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ మ్యాజిక్ గీత గోవిందం సినిమా నుంచి మొదలైంది. అందులో ఇంకేం ఇంకేం కావాలి పాట ఇప్పటికీ పాపులరే.

ఇక వచ్చిందమ్మా పాటకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా.. విజయ్, సిద్ కాంబో అంటే పాట పాపులర్ అవ్వాల్సిందే.




