- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda Kingdom Movie Censor Completed Starrer BhagyaSri Borse
Kingdom Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. శనివారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
Updated on: Jul 28, 2025 | 1:22 PM

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ మరింత క్యూరియాసిటిని కలిగించాయి.

పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. జూలై 26న సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో అప్డేట్ రివీల్ చేశారు.

శనివారం సాయంత్రం కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి U/A ట్రైలర్ అందుకున్నట్లు మేకర్స్ ఇప్పుడు కన్ఫార్మ్ చేశారు. దీంతో ఇప్పుడు ట్రైలర్ పైన్ అంచనాలు పెరిగిపోయాయి.

కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వ్చిచంది. ఇందులో సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. జూలై 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వ్చిచంది. ఇందులో సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. జూలై 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.




