- Telugu News Photo Gallery Cinema photos Actress Bhagyashri Borse Completes Vijay Deverakonda Kingdom Movie Dubbing work
Actress: డబ్బింగ్ కంప్లీట్ చేసిన హీరోయిన్.. ఆ సినిమాపైనే అమ్మాడి ఆశలు..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుంది. చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ చేతిలో ఐదారు చిత్రాలతో బిజీగా ఉంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినా ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?
Updated on: Jul 28, 2025 | 1:21 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న కింగ్ డమ్ సినిమాపైనే ఉంది. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో విజయ్ రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.

మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కాబోతుండగా.. తాజాగా తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది.

ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో తెలియజేస్తూ ఫోటో షేర్ చేసింది. దీంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. కేవలం నటనలోనే కాదు.. సొంతంగా డబ్బింగ్ చెబుతూ తన పాత్ర పట్ల ప్రేమను చూపించింది. రెండో సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ఒక సినిమాకు డబ్బింగ్ అనేది కేవలం లైన్స్ చెప్పడం కాదు.. ప్రతి మాటలో భావాన్ని చూపించడం ముఖ్యం. తెలుగు భాషలో సొంతంగా వాయిస్ ఇవ్వడం నా లక్ష్యం. పాత్రలో జీవం పోసే అవకాశం డబ్బింగ్ తో వచ్చింది అని తెలిపింది.

ఇక ఈ సినిమాలో భాగ్య శ్రీ యాక్టింగ్ తోపాటు ఆమె వాయిస్ వినడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు భాగ్యశ్రీ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ లో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.




