- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda going with mass concepts for his next movies
Vijay Devarakonda: ట్రెండు మిస్ ఫైర్ అయిన.. తగ్గేదేలే అంటున్న విజయ్ దేవరకొండ..
సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడ్డామని మళ్లీ సైకిల్ ఎక్కకుండా ఉంటామా చెప్పండి..? వచ్చేవరకు నేర్చుకుంటాం కదా..? మాస్ ఇమేజ్ కూడా అంతే.. ఒకట్రెండు మిస్ ఫైర్ అయ్యాయని అటువైపు వెళ్లకుండా ఉంటామా అంటున్నారు విజయ్ దేవరకొండ. మాస్‌లో పిహెచ్‌డీ చేయడానికి బయల్దేరారు ఈ రౌడీ హీరో. మరి అందులో సక్సెస్ అవుతాడా..?
Updated on: Mar 07, 2025 | 7:15 PM

క్లాస్ ఇమేజ్ ఎంత ఉన్నా.. మన హీరోలకు మాత్రం లోలోపల మాస్ ఇమేజ్ అంటేనే ఇష్టం. ఒక్కసారి ఆ ఇమేజ్ ఏదో వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారు. తాజాగా విజయ్ దేవరకొండ అడుగులు కూడా అటువైపే పడుతున్నాయి.

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ్‌కు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది.. కానీ అది వద్దంటున్నారీ రౌడీ హీరో. వరస ఫ్లాపులు వస్తున్నా.. విజయ్ ఫోకస్ అంతా మాస్ ఇమేజ్‌పైనే ఉంది.

డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి సినిమాలతో యాక్షన్ ట్రై చేసి ఫెయిలయ్యారు విజయ్. అలాగని కలిసొచ్చిన జోనర్‌లో ఫ్యామిలీ స్టార్ చేసినా విజయం దక్కలేదు. ఖుషీ మాత్రమే పర్లేదనిపించింది. ప్రస్తుతం రౌడీ హీరో చేస్తున్న సినిమాలన్నీ మాస్ ఆడియన్స్ కోసమే.

సెట్స్‌పై ఉన్న కింగ్ డమ్ ప్యాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. పైగా ఇది 2 పార్ట్ ఫిల్మ్.. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్‌గా నటిస్తున్నారు రౌడీ బాయ్. దీని తర్వాత రాహుల్ సంక్రీత్యన్‌తోనూ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు విజయ్.

దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామాకు కూడా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. దీనికి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ఖరారైంది. 2026లో సెట్స్‌పైకి రానుందీ సినిమా. అన్నట్లు ఫ్యామిలీ స్టార్‌లోనూ విజయ్ పాత్ర పేరు జనార్ధనే. కట్ చేస్తే.. విజయ్ వాళ్ల నాన్న పేరు జనార్ధన్. అందుకే ఈ పేరుకు ఫిదా అవుతుంటారు రౌడీ హీరో.




