- Telugu News Photo Gallery Cinema photos Did Tamannaah Bhatia get fooled in love again after breakup with Vijay Varma
Tamannaah: తమన్నా మరోసారి ప్రేమలో మోసపోయిందా..?
తమన్నా మరోసారి లవ్‌లో ఫెయిలందా..? పెళ్లి ఖాయం అనుకున్న సమయంలో ప్రియుడితో విడిపోయిందా..? మిల్కీ బ్యూటీ మరోసారి ప్రేమలో మోసపోయిందా..? ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయ్ అనుకోవచ్చు.. కానీ పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజం అని నిరూపిస్తున్నాయి. మరి తమన్నా లవ్ ఫెయిల్యూర్‌లో నిజమెంత..?
Updated on: Mar 07, 2025 | 6:45 PM

ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం నడుస్తుంది.. ప్రేమలో ఉన్నోళ్లేమో బ్రేక్ అప్ అంటున్నారు.. పెళ్లైన వాళ్లేమో విడాకులు అంటున్నారు. తాజాగా తమన్నా కూడా ప్రియుడితో విడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఈ రిలేషన్‌కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. కొన్నాళ్ల పాటు విజయ్‌తో డేటింగ్ విషయాన్ని సీక్రేట్‌గా ఉంచిన తమన్నా.. తర్వాత ఓపెన్ అయిపోయారు.

కలిసి ఈవెంట్స్‌కి రావడం.. మీడియాకు పోజులివ్వడం చేసారు. కానీ కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని.. అందుకే తమన్నా, విజయ్ ఎవరికి వాళ్లు ఒంటరిగా బయట కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

బ్రేకప్ వార్తలపై ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. ప్రేమలో ఉన్నపుడు కలిసే కనిపించిన తమన్నా, విజయ్.. ఈ మధ్య ఒక్కటిగా కనిపించిందే లేదు. ఇదే వాళ్ల బ్రేకప్‌కు సాక్ష్యం అంటుంది ముంబై మీడియా.

మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు తమన్నా. ఓదెల 2తో బిజీ బిజీగా ఉన్నారు. దాంతో పాటు హిందీలోనూ వరస సినిమాలు సైన్ చేస్తున్నారు తమన్నా. మరి ఈ బ్రేకప్ ఈమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.




