- Telugu News Photo Gallery Cinema photos Heroines whose first movies were with movies but now eyeing top spot Meenakshi Chaudhry, Bhagyashri Borse
ఫ్లాపులతో ఎంట్రీ ఇచ్చి.. టాప్ ప్లేస్‌పై కన్నేసిన హీరోయిన్లు
ఫ్లాప్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా టాప్ ప్లేస్‌పై కన్నేసారు ముగ్గురు హీరోయిన్లు. డిజాస్టర్ మూవీస్‌తో డెబ్యూ చేసినా.. రెడ్ కార్పెట్ వేసి మరీ వాళ్ళను ఆహ్వానిస్తున్నారు మన దర్శకులు. టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌత్‌లోనే సెన్సేషన్ అవుతున్నారు ఆ ముగ్గురు బ్యూటీస్. మరి అంతగా సంచలనాలు రేపుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దామా..?
Updated on: Mar 07, 2025 | 6:22 PM

కయాడు లోహర్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తుందిప్పుడు. డ్రాగన్ సినిమాతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’లో నటిస్తున్నారు ఈ బ్యూటీ.

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే.. 2022లోనే శ్రీవిష్ణు ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కయాడు. అల్లూరి ఫ్లాపవ్వడంతో కయాడు లోహర్ గురించి పెద్దగా చర్చ జరగలేదు.

కానీ డ్రాగన్ బ్లాక్‌బస్టర్ కావడంతో.. ఈ భామ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు నుంచి వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి కయాడుకు.

భాగ్యశ్రీ బోర్సే సైతం డిజాస్టర్‌తో ఎంట్రీ ఇచ్చి.. దుమ్ము దులుపుతున్నారిప్పుడు. మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా.. చేతిలో 5 భారీ ఇండియన్ సినిమాలున్నాయి ఈ భామకు. విజయ్ దేవరొకండ కింగ్ డమ్.. దుల్కర్ సల్మాన్ కాంత.. సూర్య వెంకీ అట్లూరి సినిమా.. రామ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు భాగ్యశ్రీ.

ఇక మీనాక్షి చౌదరి సైతం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే ఫ్లాప్ సినిమాతోనే పరిచయమైంది. కానీ లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాంతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ. మొత్తానికి ఫ్లాప్‌తో ఎంట్రీ ఇచ్చి టాప్ ప్లేస్‌పై కన్నేస్తున్నారు ఈ బ్యూటీస్.




