Trisha: వరుస సినిమాలతో క్షణం తీరిక లేదంటున్న సౌత్ క్వీన్ త్రిష
బిజీగా ఉండటం ఎలా? అని స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడమ్ త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్‌తో ఒక సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది..
Updated on: Sep 28, 2024 | 11:37 AM

బిజీగా ఉండటం ఎలా? అని స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడమ్ త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్‌తో ఒక సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది..

ఇన్నాళ్లు బాలీవుడ్‌కు నో చెబుతూ వచ్చిన నయనతార కూడా రీసెంట్‌గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అందుకే త్రిషను కూడా మళ్లీ బాలీవుడ్‌కి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు నార్త్ మేకర్స్.

14 ఏళ్ల కిందటే బాలీవుడ్ మూవీ చేసిన త్రిష, అక్షయ్ కుమార్‌కు జోడీగా కట్టా మీటా సినిమాలో నటించారు. తరువాత మళ్లీ ఆ వైపు చూడలేదు. నార్త్‌లో చేసిన ఒక్క సినిమా.. సూపర్ హిట్టే అయినా.. బాలీవుడ్‌లో కంటిన్యూ కాలేదు.

తమిళంలోనే కాదు.. మలయాళంలోనూ చేతినిండా సినిమాలున్నాయి సౌత్ క్వీన్ త్రిషకి. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కాంపౌండ్‌లో చేస్తున్న థగ్‌లైఫ్ కోసం ఆడియన్స్ తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు.

అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్ మూవీ చేసిన ఓ సీనియర్ బ్యూటీ మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ఏకంగా 14 ఏళ్ల తరువాత మళ్లీ ఓ హిందీ మూవీకి ఓకే చెప్పారు.