తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలెవరంటే.. ముందుగా రజినీకాంత్ పేరు వినిపిస్తుంది.. ఆ తర్వాత విజయ్, అజిత్ అంటూ పెద్ద లిస్టే ఉంది. అందులో రజినీ ఏడాదికి ఒక్క సినిమా.. కుదిర్తే రెండేళ్లకో సినిమా చేస్తున్నారు. సూర్య, కమల్ హాసన్, ధనుష్ లాంటి వాళ్లంతా సినిమాలు చేసినా.. వందల కోట్ల రేంజ్‌కు వెళ్లలేదు. దాంతో భారమంతా రజినీ, విజయ్, అజిత్ మోస్తున్నారిప్పుడు.