- Telugu News Photo Gallery Cinema photos Actress Divya Bharathi Says About Her College Days, and Comments About Her Look
Tollywood: అప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు.. ఈ వయ్యారి ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..
సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ కామెంట్స్, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఒక్క సినిమాతో తన క్రేజ్ ఊహించని విధంగా మార్చుకుంది ఈ హీరోయిన్. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
Updated on: Sep 28, 2024 | 11:19 AM

సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ కామెంట్స్, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఒక్క సినిమాతో తన క్రేజ్ ఊహించని విధంగా మార్చుకుంది ఈ హీరోయిన్. తనే దివ్య భారతి.

అందం, అభినయంతో మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి మోడలింగ్ రంగంలో పీసీగా పని చేస్తూ సినిమా అవకాశాలను అందుకుంది.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో గ్లామర్ లుక్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

కానీ కాలేజీ రోజుల్లో తన శరీరాకృతి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయని.. తనను బాడీ షేమింగ్ చేస్తూ ఆట పట్టించేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దివ్యభారతికి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది.




