- Telugu News Photo Gallery Cinema photos Tollywood Young Heroes naveen polishetty teja sajja siddu jonnalagadda Business in Film industry Telugu Heroes Photos
Telugu Young Heroes: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! స్టార్ హీరోస్ రేంజ్ లో బిజినెస్ నడుపుతున్న కుర్రహీరోలు.
అబ్బబ్బా.. ఏమున్నార్రా ఇండస్ట్రీలో కుర్రాళ్లు.. కత్తులంటే నమ్మండి..! ఇలా వచ్చేస్తున్నారు హిట్టు కొట్టేస్తున్నారు.. మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.. ఏకంగా స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోల గురించి జరుగుతున్న చర్చ ఇదే. నో బ్యాగ్రౌండ్.. ఓన్లీ టాలెంట్‌తో కుమ్మేస్తున్నారాళ్లు. మరి ఆ యంగ్ సెన్సేషన్స్ ఎవరు..? వాళ్ల మార్కెట్ రేంజ్ ఏంటి..?
Updated on: Nov 13, 2023 | 7:12 AM

అబ్బబ్బా.. ఏమున్నార్రా ఇండస్ట్రీలో కుర్రాళ్లు.. కత్తులంటే నమ్మండి..! ఇలా వచ్చేస్తున్నారు హిట్టు కొట్టేస్తున్నారు.. మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.. ఏకంగా స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టేస్తున్నారు.

ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోల గురించి జరుగుతున్న చర్చ ఇదే. నో బ్యాగ్రౌండ్.. ఓన్లీ టాలెంట్‌తో కుమ్మేస్తున్నారాళ్లు. మరి ఆ యంగ్ సెన్సేషన్స్ ఎవరు..? వాళ్ల మార్కెట్ రేంజ్ ఏంటి..?

నిజంగానే ఈ మధ్య వస్తున్న కొందరు హీరోలను చూస్తుంటే జాతి రత్నాల్లాగే ఉన్నారు. అంటే సినిమాల్లో జాతి రత్నాలు కాదండోయ్.. నిజమైన రత్నాలని మా ఉద్దేశ్యం. కావాలంటే నవీన్ పొలిశెట్టినే తీసుకోండి..

పదేళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఈయనేంటో తెలియడానికి చాలా టైమ్ పట్టింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ పూర్తి చేసారు నవీన్.

సిద్ధూ జొన్నలగడ్డ కూడా అంతే. సొంతంగా కథ, స్క్రీన్ ప్లే రాసుకుని డిజే టిల్లు చేసి సూపర్ హిట్ కొట్టారు ఈ హీరో. తాజాగా డిజే టిల్లు 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా బిజినెస్ మీడియం రేంజ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో జరుగుతుంది.

ఇది కానీ హిట్ అయితే సిద్దూ మార్కెట్ 25 కోట్లకు చేరడం ఖాయం. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్, నీరజ కోన సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ హీరో.

తేజ సజ్జా సైతం సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు. జాంబి రెడ్డి తర్వాత ఈయనకు సరైన హిట్ లేకపోయినా.. ప్రస్తుతం నటిస్తున్న హనుమాన్ బిజినెస్ ఏ మీడియం రేంజ్ హీరోకు తక్కువగా లేదు.

పైగా సంక్రాంతికి వస్తుంది ఈ చిత్రం. ఇక అడివి శేష్ సైతం సొంతంగా ఎదిగిన స్టార్ బాయ్. సొంత స్టోరీస్ తోనే ఈయన కూడా స్టార్ అయ్యారు. మొత్తానికి ఈ కుర్రాళ్లే ఇండస్ట్రీని రప్ఫాడిస్తున్నారిప్పుడు.




