Directors: ఎన్నో ఏళ్ళ ఆకలితో దర్శకులు.. ఈసారైనా వేట సక్సెస్ అవుతుందా.?
సినిమా ఇండస్ట్రీలో కెప్టెన్ కుర్చీలో కూర్చోవడం, పులి మీద స్వారీ చేయడం ఒకటేనా?... ఒక్కసారి కిందపడితే పైకి లేవడం అంత తేలిక కాదా... మళ్లీ హిట్ అందుకోవాలంటే, రేయింబవళ్లు కష్టపడాల్సిందేనా.. కలిసొచ్చే కాలం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ముగ్గురు సీనియర్ కెప్టెన్లు ఎవరు? వాళ్ల కలలు నెరవేరేదెప్పుడు? లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది.
Updated on: Feb 22, 2024 | 9:29 AM

లైగర్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ మార్చుకున్న తీరు ఇన్‌స్పయిరింగ్ అని అప్పట్లో అందరూ పొగిడారు. కానీ విజయ్ కష్టాన్ని స్క్రీన్ మీద సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు పూరి జగన్నాథ్. సరైన కథ లేకపోవడం, దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించకలేకపోవడంతో లైగర్ అట్టర్‌ఫ్లాప్ అయింది.

లైగర్ ఫ్లాప్ అయినా, విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ, పూరి జగన్నాథ్ మాత్రం కోలుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రామ్‌తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే గానీ, పూరి మళ్లీ ఫామ్‌లోకి రాలేరు. ఆల్రెడీ స్కంధతో ఫ్లాపుల్లో ఉన్నారు రామ్. సో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ హిట్ అటు రామ్‌కీ, ఇటు పూరికి ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్.

సేమ్ టు సేమ్ పూరి జగన్నాథ్ ఎలాంటి ఫేజ్‌లో ఉన్నారో, వి.వి.వినాయక్ కూడా అలాంటి ఫేజ్‌లోనే ఉన్నారు. మెగాస్టార్‌తో వినాయక్ సినిమా ఉంటుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ వాటిలో నిజానిజాలేంటన్నది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్న మెగాస్టార్, ఆ వెంటనే హరీష్ శంకర్ సెట్స్ కి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాతైనా వినాయక్‌కి అవకాశమిస్తారా? ఇచ్చినా వినాయక్ సద్వినియోగం చేసుకునే స్టేజ్‌లోనే ఉన్నారా? మెగాస్టార్‌కి తగ్గ కథను ఆల్రెడీ సెలక్ట్ చేసుకున్నారా? సరిగ్గా ఇలాంటి చర్చే జరుగుతోంది ఫిల్మ్ నగర్‌లో.

ఫ్యామిలీ అంతా కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమాలు చేస్తారు శ్రీనువైట్ల. అన్ని ఎమోషన్స్ ని అందంగా పండించగల ఈ డైరక్టర్ ఫ్లాపుల నుంచి బయటపడలేకపోతున్నారు. మూస ధోరణి నుంచి బయటకు రాలేని పక్షంలో ప్రేక్షకుల తీర్పు ఇలాగే ఉంటుందని అంటారు క్రిటిక్స్. మరి ఇప్పుడు గోపీచంద్‌తో చేసే సినిమాలోనైనా కొత్తదనాన్ని కనబరుస్తారా? మళ్లీ కెప్టెన్ కుర్చీలో శ్రీనువైట్ల కళకళలాడుతూ కనిపిస్తారా? అనేది సినీ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్.




