- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies vishwambhara, pushpa 02, devara, shooting updates
Tollywood News: వరుస షూటింగులతో కళకళలాడుతున్న భాగ్యనగరం
పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా షూటింగులను పూర్తి చేసి తీరాలనే డెడికేషన్‌తో పనిచేస్తున్నారు మన స్టార్ హీరోలు. చాలా వరకు హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగులు చేసేస్తున్నారు. ఇంతకీ పోయిన వారం వెళ్లిన లొకేషన్లకి ఎంత మంది వెళ్తున్నారు.. కొత్త ప్లేస్‌లను ఎవరు ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు.! మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Updated on: Aug 22, 2024 | 7:32 PM

పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా షూటింగులను పూర్తి చేసి తీరాలనే డెడికేషన్‌తో పనిచేస్తున్నారు మన స్టార్ హీరోలు. చాలా వరకు హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగులు చేసేస్తున్నారు. ఇంతకీ పోయిన వారం వెళ్లిన లొకేషన్లకి ఎంత మంది వెళ్తున్నారు.. కొత్త ప్లేస్‌లను ఎవరు ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకులకు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలనే ఇంటెన్షన్‌తో పనిచేస్తున్నారు వశిష్ట. అంతే వేగంగా షూటింగ్ జరుపకుంటోంది రాజా సాబ్. శంషాబాద్ పరిసరాల్లో సేమ్ లొకేషన్‌లోనే తెరకెక్కిస్తున్నారు మారుతి.

రెండు యూనిట్లతో షూటింగ్ స్పీడు పెంచారు కెప్టెన్ సుకుమార్. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది. కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

పదహారేళ్ల వయసులో.. నటించిన శ్రీదేవిని వేటగాడులో హీరోయిన్‌గా పెడదామని కె.రాఘవేంద్రరావు.. నందమూరి తారకరామారావుతో అన్నప్పుడు.. 'ఆమెకు పదహారైతే.. మనకు పద్నాలుగే కదా బ్రదర్' అంటూ చమత్కరించారట.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. 2025 సంక్రాంతి మా వంతు ఫన్ పంచడం పక్కా అనే గ్యారంటీ ఇస్తున్నారు అనిల్ రావిపూడి.




