- Telugu News Photo Gallery Cinema photos Telugu Movies still shooting even though release date has been fixed like Devara, Thandel
ఇంకా సెట్స్ మీదున్న సినిమాలు.. రిలీజ్ డేట్‌ని అందుకుంటాయా ??
సినిమా షూటింగులన్నీ పూర్తయ్యాక డేట్లు రిలీజ్ చేసే కల్చర్ లేదిప్పుడు. ఓ డెడ్‌లైన్ పెట్టుకుని దానికి తగ్గట్టు పరుగులు తీసేవారి సంఖ్యే ప్రముఖంగా కనిపిస్తోంది. ఆల్రెడీ రిలీజ్‌డేట్ ఫిక్స్ చేసుకున్న ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఇప్పడు ఇంకా సెట్స్ మీదే ఉన్నాయి... వాటి మీద ఓ లుక్ వేసేద్దాం వచ్చేయండి... తారక్ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కానీ, దేవర షూటింగ్ మాత్రం శరవేగంగానే జరుగుతోంది. ఎలాగైనా డెడ్‌లైన్‌ని మీట్ కావాలనే డెడికేషన్‌తో పనిచేస్తోంది టీమ్.
Updated on: Aug 22, 2024 | 7:26 PM

సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. అయితే దానికంటే ఒకరోజు ముందే సెప్టెంబర్ 26న అమెరికా, లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరను ప్రదర్శించబోతున్నారు. ఎంతోమంది హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ హాజరు కానున్న ఈ ఈవెంట్‌కు దేవర యూనిట్ హాజరు కానున్నారు.

అనుకోని పరిస్థితుల్లో దేవర మిస్ అవ్వడం.. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న దేవర కొడుకు తన వాళ్ల కోసం నిలబడటం ట్రైలర్‌లో చూపించారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది దేవర పార్ట్ 1. మరి చూడాలిక.. తారక్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో.?

ఇటు గేమ్ చేంజర్ టీమ్‌లోనూ ఇదే స్పిరిట్ కనిపిస్తోంది. కాకపోతే రెగ్యులర్‌గా షూటింగ్ జరుపుకోవడం లేదు గేమ్ చేంజర్. లొకేషన్లు, ఆర్టిస్టుల అందుబాటును బట్టి బ్యాలన్స్ షూట్ పూర్తి చేస్తున్నారు శంకర్.

విషయమేంటి? అంటారా.? డెడ్‌లైన్‌ని మీట్ కావాలంటే ప్రొడక్షన్‌లో జోరు చూపించాలి. ఆ జోరు కూడా జోడు గుర్రాలు పరిగెత్తినంత స్పీడ్‌గా ఉండాలి. ఇప్పుడు పుష్ప2 అలాంటి జోరునే చూపిస్తోంది.

ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య కూడా తండేల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వట్టినాగులపల్లి సమీపంలో జరుగుతోంది తండేల్ షూట్. డిసెంబర్‌లో రిలీజ్‌కి గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు నాగచైతన్య అండ్ సాయిపల్లవి.

Tollywood News




