- Telugu News Photo Gallery Cinema photos Tollywood Movies Updates on 01 12 2023 Telugu Entertainment Photos
Tollywood: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో మొదలైన రకుల్ మూవీ జర్నీ.| మాళవిక మోహనన్ డబ్బింగ్ కష్టం.
మూవీ ఎక్స్‌ప్రెస్: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాను గుర్తుచేసుకున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. తన కెరీర్‌లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైందని అన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారతీయుడు2, అయలాన్ సినిమాలు సెట్స్ మీదున్నాయి.| డబ్బింగ్ కష్టం: విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయని,
Updated on: Dec 01, 2023 | 9:29 PM

బిగ్ డే : సందీప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్. రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. అనిల్ కపూర్ కీ రోల్ చేశారు. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు సర్వత్రా మంచి స్పందన వస్తోంది.

సాహసమే జీవితం: మనుగడ కోసం చేస్తున్న సాహసం అంటూ తన ఆడుజీవితం సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆడుజీవితం. నమ్మశక్యం కాని ఓ నిజమైన కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు పృథ్విరాజ్.

డబ్బింగ్ కష్టం: విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయని, తనకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమని అన్నారు మాళవిక. వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది తంగలాన్.

కారు గిఫ్ట్: ప్రముఖ హీరోయిన్ నయనతారకు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు ఆమె భర్త విఘ్నేష్ శివన్. నవంబర్ 18న ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్ డే గిఫ్ట్ గా కారు ఇచ్చినట్టు తెలిపారు విఘ్నేష్. నయనతార నటించిన అన్నపూరణి ఇవాళ విడుదలైంది.

మూవీ ఎక్స్‌ప్రెస్: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాను గుర్తుచేసుకున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. తన కెరీర్‌లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైందని అన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారతీయుడు2, అయలాన్ సినిమాలు సెట్స్ మీదున్నాయి.




