- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines saiee manjrekar meenakshi chaudhary nabha natesh are got huge movie chances
Tollywood Heroines: టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు
ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు.. మేం కూడా ఉన్నాం.. మమ్మల్ని గుర్తించండి.. మా గురించి కూడా చెప్పంటి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు. టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. టైమ్ వస్తే టాప్ గేర్ వెళ్లడానికి అరడజన్ మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. మరి వాళ్లెవరు..? ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల హవానే కాదు.. వాళ్ల తర్వాత ఉండే ముద్దుగుమ్మలు కూడా బాగానే ప్రభావం చూపిస్తుంటారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jul 05, 2024 | 4:17 PM

ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు.. మేం కూడా ఉన్నాం.. మమ్మల్ని గుర్తించండి.. మా గురించి కూడా చెప్పంటి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు. టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. టైమ్ వస్తే టాప్ గేర్ వెళ్లడానికి అరడజన్ మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. మరి వాళ్లెవరు..?

ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల హవానే కాదు.. వాళ్ల తర్వాత ఉండే ముద్దుగుమ్మలు కూడా బాగానే ప్రభావం చూపిస్తుంటారు. మీడియం బడ్జెట్ సినిమాలకు వీళ్లే ఆధారం. ఈ లిస్టులో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి. వరస సినిమాలతో టాప్ రేస్‌లోకి వచ్చేయాలని చూస్తున్నారు మీనాక్షి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈమె ఓ హీరోయిన్.

నభా నటేష్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. అప్పుడెప్పుడో యాక్సిడెంట్‌కు ముందు వరస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శితో డార్లింగ్.. నిఖిల్‌తో స్వయంభు సినిమాల్లో నటిస్తూ టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు.

డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టికి కూడా వరస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గతేడాది బెదురులంక, రూల్స్ రంజన్ లాంటి సినిమాలు చేసారు. మొన్నటికి మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ నటించారు. అయితే కెరీర్‌ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నేహా శెట్టి. ప్రస్తుతానికి తెలుగులో నేహాకు అవకాశాలు రావట్లేదు.

తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం పాకులాడుతున్న మరో బ్యూటీ సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబంగ్ 3తో పరిచయమైన ఈ బ్యూటీ.. మేజర్, గని, స్కంద లాంటి సినిమాలు చేసారు. కానీ కోరుకున్న గుర్తింపైతే రాలేదు. తాజాగా నిఖిల్ ది ఇండియా హౌజ్‌లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు సాయి మంజ్రేకర్. మరోవైపు భాగ్య శ్రీ బోర్సే పేరు కూడా టాలీవుడ్‌లో బానే వినిపిస్తుంది.





























