- Telugu News Photo Gallery Cinema photos Thalapathy Vijay jets off to the USA for the GOAT shoot paruchuri gopala krishna comments on pawan kalyan
Tollywood News: లాస్ ఏంజెల్స్ లో గోట్ | సీనియర్ ఎన్టీఆర్‌లాగా పవన్ కల్యాణ్
తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలాలో కంటెస్టంట్లు, జడ్జిల మధ్య జరిగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. ఆహాలో ప్రతి శుక్ర, శనివారం రాత్రి ఏడుగంటలకు ప్రసారం అవుతుంది తెలుగు ఇండియన్ ఐడల్3. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేయాలన్నది తన కోరికన్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.
Updated on: Jul 05, 2024 | 3:13 PM

AHA: తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలాలో కంటెస్టంట్లు, జడ్జిల మధ్య జరిగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. ఆహాలో ప్రతి శుక్ర, శనివారం రాత్రి ఏడుగంటలకు ప్రసారం అవుతుంది తెలుగు ఇండియన్ ఐడల్3.

Paruchuri Gopala Krishna: పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేయాలన్నది తన కోరికన్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటించారని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమాలకు వీఎఫ్ ఎక్స్ ఎఫెక్టులు, ఫైటింగులు అవసరం లేదని, చిన్న డైలాగులు చాలని చెప్పారు.

Mirzapur Season 3: క్రైమ్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన మీర్జాపూర్ రెండు సీజన్లు జనాలను అలరించాయి. ఇప్పుడు మూడో సీజన్ విడుదలకు రెడీ అవుతోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫాజల్, విక్రాంత్ మాస్సే కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ థర్డ్ సీజన్ ఈ నెల 5 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

Laila: లైలా సినిమాలో హీరోగా నటిస్తూ, మహిళా పాత్రలోనూ కనిపించనున్నారు హీరో విశ్వక్సేన్. షైస్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది లైలా.

GOAT: విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా గోట్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది పూర్తి పేరు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని లోలా వీఎఫ్ఎక్స్ లో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు డైరక్టర్ వెంకట్ ప్రభు. సెప్టెంబర్ 5న విడుదల కానుంది గోట్.




