- Telugu News Photo Gallery Cinema photos Mohan babu response on drugs nayanthara signed on another movie
Tollywood News: డ్రగ్స్ పై స్పందించిన మోహన్ బాబు | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార
యష్ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 1950 నుంచి 1970 మధ్య కాలంలో జరిగే కథతో తెరకెక్కుతోందట. ప్రస్తుతం బెంగుళూరు శివార్లలో కొన్ని ప్రత్యేకమైన సెట్లు ఏర్పాటు చేసి, కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే లండన్‌లో మేజర్ షెడ్యూల్ మొదలుకానుంది. సన్ ఆఫ్ సర్దార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కనుంది సన్నాఫ్ సర్దార్ 2. అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్ ఇందులో కీ రోల్స్ చేయనున్నారు.
Updated on: Jul 05, 2024 | 2:58 PM

Toxic: యష్ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 1950 నుంచి 1970 మధ్య కాలంలో జరిగే కథతో తెరకెక్కుతోందట. ప్రస్తుతం బెంగుళూరు శివార్లలో కొన్ని ప్రత్యేకమైన సెట్లు ఏర్పాటు చేసి, కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే లండన్‌లో మేజర్ షెడ్యూల్ మొదలుకానుంది.

Son of Sardaar 2: సన్ ఆఫ్ సర్దార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కనుంది సన్నాఫ్ సర్దార్ 2. అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్ ఇందులో కీ రోల్స్ చేయనున్నారు. ఫస్ట్ పార్టుతో సంబంధం లేకుండా, సెకండ్ పార్టు కథ సాగుతుందట. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాయికగా నటించనున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది సన్నాఫ్ సర్దార్2.

SSMB29: మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానుంది భారీ సినిమా. ఈ చిత్రంలో విలన్‌గా పృథ్విరాజ్ సుకుమారన్‌ని ఖాయం చేసినట్టు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Nayanthara: వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల విజయ్ సేతుపతితో మహారాజ అనే సినిమాను తెరకెక్కించిన నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నయన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సామాజిక స్పృహ ఉన్న కథాంశంతో తెరకెక్కనుంది ఈ చిత్రం.

Mohanu Babu: యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తూ సినీ ప్రముఖులు వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి స్పందించారు మంచు మోహన్‌బాబు. గతంలో కొన్ని వీడియోలు చేశానని, అయినా, సీఎం ఆదేశం మేరకు మరికొన్ని సందేశాత్మక వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజ సేవ చేసుకుంటానని చెప్పారు.




