- Telugu News Photo Gallery Cinema photos Star heroines are in a situation where they cannot say what will be the next movie
Tollywood Star Heroines: అందరూ స్టార్ హీరోయిన్లే.. ఆ ఒక్కటి అడగితే సమాధానం ఇవ్వలేరు..!
నెక్ట్స్ ఏంటి చెప్పుకోండి చూద్దాం..? ఏంటి క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో జరుగుతున్నదిదే. అందరూ స్టార్ హీరోయిన్లే.. కానీ వాళ్ల నెక్ట్స్ సినిమా ఏంటో చెప్పలేని పరిస్థితి. అభిమానులను కన్ఫ్యూజన్‌లో పెట్టి.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు..?
Updated on: Dec 14, 2023 | 4:18 PM

కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లలో ఒక్కసారి కూడా నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన లేకుండా.. చేతిలో కనీసం ఒక్క సినిమానైనా బ్యాక్ అప్ పెట్టుకున్న పూజా హెగ్డేతో బ్యాడ్ టైమ్ బంతాట ఆడేస్తుందిప్పుడు. ఈమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదిప్పుడు. గుంటూరు కారం, ఉస్తాద్‌లను శ్రీలీల, సాక్షి వైద్య లాంటి హీరోయిన్స్ పట్టుకెళ్ళిపోయారు. సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ ఒప్పుకున్నా.. అది మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది.

అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్ తర్వాత జేజమ్మ క్రేజ్ మళ్ళీ పెరిగిపోయింది. కానీ ఈమె మాత్రం తెలుగులో నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. మలయాళంలో కథనార్ అనే సినిమా మాత్రం చేస్తున్నారు అనుష్క. పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.

సమంత సైతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అవకాశాలు వస్తున్నా కూడా తన ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకున్నారు స్యామ్. దాంతో ఈమె నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రావడానికి ఏడాది టైమ్ పట్టడం ఖాయం. ఖుషి తర్వాత ఈమె తెలుగు సినిమాలేవీ సైన్ చేయలేదు. సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి కావడంతో ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ.

అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యారు ప్రగ్యా జైస్వాల్. అలాగే బాలయ్యతో వీరసింహారెడ్డిలో నటించిన హనీ రోజ్ సైతం ఇప్పటికీ మరో సినిమా సైన్ చేయలేదు.

ఇస్మార్ట్ హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్‌కు సైతం వెయిటింగ్ తప్పట్లేదు. వీళ్లే కాదు మరికొందరు ముద్దుగుమ్మలు కూడా నెక్ట్స్ ఏంటో తెలియక దిమాక్ ఖరాబ్ చేసుకుంటున్నారు.




