Sreeleela: బ్రేక్ ఇచ్చిన హీరోతోనే మరోసారి కాంబినేషన్.. ఈ సారి సక్సెస్ అయ్యేనా ??
శ్రీలీల టైమ్ టర్న్ అవుతుందా..? చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఈమెకు అవకాశాలు క్యూ కట్టబోతున్నాయా..? గుంటూరు కారం తర్వాత ఖాళీగా ఉన్న శ్రీలీలకు.. పాత పరిచయాలే హెల్ప్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. కలిసొచ్చిన కాంబినేషన్‌లోనే మరో సినిమాకు రెడీ అవుతున్నారీ బ్యూటీ. మరి ఏంటది..? ఈ బ్యూటీ బిజీ అయ్యేదెప్పుడు..? గుంటూరు కారం తర్వాత ఊహించని విధంగా శ్రీలీల కెరీర్ నెమ్మదించింది.