సడన్‌గా సైలెంట్ అయ్యి.. క్రేజీ స్టోరీ తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్న శ్రీ విష్ణు
ఆ మధ్య వరసగా రెండు మూడు విజయాలు అందుకుని.. మళ్లీ సడన్‌గా సైలెంట్ అయిపోయారు శ్రీ విష్ణు. తాజాగా ఈయన మరో క్రేజీ సినిమాతో వచ్చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కంటెంట్ అంటూ వచ్చేస్తున్న ఈయన.. మరో హిట్ కొడతారా..? హ్యాష్ ట్యాగ్ సింగిల్‌తో శ్రీ విష్ణు బ్యాక్ టూ ట్రాక్ ఎక్కేస్తారా..? అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది..?
Updated on: Apr 18, 2025 | 6:51 PM

ఒకప్పుడు శ్రీ విష్ణు అంటే సీరియస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు. పూర్తిగా యూత్‌కు నచ్చే కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు. అలాగని ఫ్యామిలీస్‌కు దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు.

సామజవరగమనా లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు.. ఓం భీమ్ బుష్‌తో యూత్‌కు సమన్యాయం చేసారీయన. వరసగా రెండు విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన స్వాగ్ అంతగా ఆడలేదు.

ఈ సినిమాకు ఓటిటిలో టాక్ బాగా వచ్చింది గానీ థియెట్రికల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ సింగిల్ అంటూ మరో క్రేజీ సినిమాతో వచ్చేస్తున్నారు. పేరుకి సింగిల్ అయినా.. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.

ఇవానా, కేతిక శర్మ ఇందులో శ్రీ విష్ణుతో జోడీ కడుతున్నారు. గీతా ఆర్ట్స్ నుంచి ఈ సినిమాకు కార్తిక్ రాజు దర్శకుడు. తాజాగా సింగిల్ సినిమా నుంచి జానీ జానీ ఎస్ పప్పా.. జగమంతా జంటలే నేను తప్పా అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

మే 9న ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు వస్తుందనుకున్న హరిహర వీరమల్లు మరోసారి వాయిదా వైపే అడుగులేస్తుండటంతో.. సింగిల్ ఆ డేట్‌ను లాక్ చేసేలా ఉన్నారు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు మళ్లీ మాయ చేస్తారేమో చూడాలిక.




