- Telugu News Photo Gallery Cinema photos Small Budget movies like tillu square, committee kurrollu, aay, mathu vadalara 2 gets huge collection
ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన చిన్న సినిమాలు.. అవేంటో తెలుసా ??
అన్నిసార్లు పెద్ద సినిమాలే వచ్చి ఇండస్ట్రీని ఆదుకోవడం కష్టమే.. పైగా భారీ సినిమాల సక్సెస్ రేట్ కూడా తక్కువే. అలాంటి సమయంలోనే చిన్న సినిమాల వ్యాల్యూ ఇండస్ట్రీకి తెలుస్తుంది. ఖాళీగా పడి ఉన్న థియేటర్స్‌కు కళ తీసుకొచ్చేది ఈ లో బడ్జెట్ సినిమాలే. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. ఈ ఏడాది చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2024లో గుంటూరు కారం, కల్కి మినహా పెద్ద సినిమాలు పెద్దగా రాలేదు.
Updated on: Sep 19, 2024 | 11:46 AM

ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ కంప్లీట్ చేయాలంటే ఆయన స్పీడూ చూపించకతప్పదు. వీళ్లు పరుగులూ తీయించక తప్పదు.. అని అంటోంది ఇండస్ట్రీ.

2024లో గుంటూరు కారం, కల్కి మినహా పెద్ద సినిమాలు పెద్దగా రాలేదు. ఇందులో కల్కి 1100 కోట్లు వసూలు చేయగా.. 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది గుంటూరు కారం. ఈ రెండూ మినహా.. 2024ను కాపాడుతున్నది పూర్తిగా చిన్న సినిమాలే.

సంక్రాంతికి వచ్చిన హనుమాన్ అయినా.. సమ్మర్‌లో వచ్చిన టిల్లు స్క్వేర్ అయినా.. సేవియర్స్ మాత్రం లో బడ్జెట్ సినిమాలే. కల్కి తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్‌ను సరిపోదా శనివారంతో గాడిన పెట్టారు నాని.

ఈ భారీ సినిమాల మధ్యలో లో బడ్జెట్‌తో వచ్చిన కమిటీ కుర్రోళ్లు కుమ్మేసారు. యధు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలైంది.. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు బయ్యర్లకు లాభాల పంట పండించింది. అలాగే ఆగస్ట్ 15న వచ్చిన ఆయ్ కూడా డబుల్ బ్లాక్‌బస్టరే.

కమిటీ కుర్రోళ్లు, ఆయ్ మాత్రమే కాదు.. మొన్నొచ్చిన 35.. గతవారం విడుదలైన మత్తు వదలరా 2 కూడా మంచి విజయం అందుకున్నాయి. మరీ ముఖ్యంగా మత్తు వదలరా 2 అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. త్వరలోనే శ్రీ విష్ణు స్వాగ్, మ్యాడ్ 2 లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. మొత్తానికి ఈ చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ను కాపాడుతున్నాయి.




