- Telugu News Photo Gallery Cinema photos Singer Asha Bhonsle Grand Daughter Zanai Bhonsle Latest Photos goes viral
Asha Bhonsle: లెజెండ్ సింగర్ ఆశా భోస్లే మనవరాలిని చూశారా..? ఆమె ముందు హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
సినీ సంగీత ప్రపంచంలో దాదాపు 1000 పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే. 1943లో ప్రారంభమైన ప్రస్థానం సుమారు అరవయ్యేళ్లపాటు విజయవంతంగా సాగింది. ఇప్పుడు ఆమె మనవరాలు జనయ్ భోస్లే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆశా భోస్లే కుమారుడు ఆనంద్ భోస్లే, అనూజల కుమార్తె సనయ్ భోస్లే.
Updated on: Aug 29, 2024 | 12:40 PM

సినీ సంగీత ప్రపంచంలో దాదాపు 1000 పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే. 1943లో ప్రారంభమైన ప్రస్థానం సుమారు అరవయ్యేళ్లపాటు విజయవంతంగా సాగింది. ఇప్పుడు ఆమె మనవరాలు జనయ్ భోస్లే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆశా భోస్లే కుమారుడు ఆనంద్ భోస్లే, అనూజల కుమార్తె సనయ్ భోస్లే. తన నానమ్మతో కలిసి అనేకసార్లు సినిమా ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్, పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొంది సనయ్. ఈ క్రమంలోనే ఆమె స్పెషల్ అప్పీరియన్స్ ఫిదా చేసింది.

సంగీతంలో చురుగ్గా ఉండే సనాయ్.. ఆశా భోంస్లేతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సనయ్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె రూపురేఖలు హీరోయిన్ కాజోల్, ఐశ్వర్యరాయ్‌లను గుర్తుకు తెస్తు్న్నాయని అభిమానులు అంటున్నారు.

సనయ్ భోస్లే త్వరలోనే కథానాయికగా సినీరంగ ప్రవేశం చేయనుంది. సందీప్ సింగ్ నిర్మిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రను సనయ్ పోషించనున్నారు.

అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. సనయ్ నటిస్తోన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 2026 ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నారు.




