మార్చి 6న అల్లు అర్జున్, స్నేహాల వివాహ వార్షికోత్సవం. ఈ క్రమంలోనే భార్యపై తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో చూపించారు బన్నీ. స్నేహాతో ఉన్న ఫోటోను షేర్ చేసిన బన్నీ... హ్యాపీ అనివర్సరీ క్యూటీ, 13 ఏళ్లు పూర్తి అయ్యింది. నీతో బంధం కారణంగానే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నీవు నాకు ఎంతో శక్తిని ఇచ్చావు. మనం ఇద్దరం ఇలా మరిన్ని వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసారు.