సెకండ్ ప్రెగ్నెన్సీకి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఉపాసన. తన వైద్యులు ఎప్పుడు సలహా ఇస్తే, అప్పుడు తాను సిద్ధమేనని అంటున్నారు. అంతే కాదు, కాస్త ఆలస్యంగా గర్భం దాల్చడం పూర్తిగా తన ఇష్టప్రకారమే జరిగిందని అన్నారు. దాని గురించి తాను అసలు ఆలోచించడం లేదని కూడా తెలిపారు. మహిళల ఆరోగ్యం గురించి, వాళ్ల ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుతూ, ఈ విషయాలను షేర్ చేసుకున్నారు ఉపాసన కొణిదెల. క్లింకారా కొణిదెల పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో సంబరాలకు అసలు కొదవేలేదు. మెగా మనవరాలిగా, అందరి గారాలపట్టిగా పెరుగుతున్నారు క్లింకారా.