- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu to Trisha Krishnan latest movie updates from Tollywood
Heroines: షాకింగ్.. 13 ఏళ్లు తగ్గిన సామ్! ఇంతకీ.. త్రిష చేస్తున్న పనేంటి?
యంగ్ లుక్‌లో కనిపించడానికి ఏదో ఒకట్రెండేళ్లు తగ్గినట్టు కనిపిస్తే సరిపోతుంది. అదే పదేళ్లయితే ఏదో ప్రయోగానికి రెడీ అవుతున్నారని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపించే జాన్వీ కపూర్, నార్త్ సినిమాల్లో మాత్రం సీరియస్ ఇష్యూస్‌నే టేకప్ చేశారు. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాలు కాసింత ఆ నోట్‌లోనే కనిపిస్తాయి. ఇంతకు ముందు... సినిమా ప్రోగ్రెస్ గురించి, మూవీ యూనిట్ ఏ ప్రెస్‌నోట్ ఇస్తేనో, ప్రెస్‌మీట్ కండక్ట్ చేస్తేనో మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆ సెట్లో ఉన్నవాళ్ల మూడ్‌ని బట్టి, స్పాట్‌లో జరుగుతున్నవాటిని ఓపెన్‌గా షేర్ చేసేస్తున్నారు.
Updated on: Feb 26, 2024 | 3:44 PM

యంగ్ లుక్‌లో కనిపించడానికి ఏదో ఒకట్రెండేళ్లు తగ్గినట్టు కనిపిస్తే సరిపోతుంది. అదే పదేళ్లయితే ఏదో ప్రయోగానికి రెడీ అవుతున్నారని అనుకోవచ్చు. మరీ 13 ఏళ్లు తగ్గడమేంటి? అందులోనూ మయోసైటిస్‌తో మొన్న మొన్నటిదాకా బాధపడ్డ సమంతకు ఏజ్ పరంగా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అలాగని ఇదేం గాసిప్ కూడా కాదు.

స్వయంగా సమంత డిక్లేర్ చేసిన న్యూస్. ఇంతకీ 13 ఏళ్ల మతలబేంటి... అనుకుంటున్నారా? సమంత మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లేనట. ఆమె రియల్ ఏజ్ 36 ఏళ్లు. సో అక్కడ, ఆ 13 ఏళ్ల గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ వర్కవుట్లు చేస్తూ, హెల్దీగా తింటూ, మెంటల్ పీస్ కోసం ట్రై చేస్తుంటే తప్పకుండా యంగ్‌గానే ఉండొచ్చని అంటున్నారు సామ్.

సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపించే జాన్వీ కపూర్, నార్త్ సినిమాల్లో మాత్రం సీరియస్ ఇష్యూస్‌నే టేకప్ చేశారు. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాలు కాసింత ఆ నోట్‌లోనే కనిపిస్తాయి. రంగు రంగుల కమర్షియల్ హీరోయిన్ కేరక్టర్‌ని ఆమె అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో పోట్రే చేయలేదన్నదే నిజం. ఇప్పుడు సౌత్‌లో ఆమె దేవరలో నటిస్తున్నారు. భయమన్నది తెలియనివారిని భయపెట్టే వ్యక్తిగా దేవరలో నటిస్తున్నారు తారక్.

రెండు పార్టులుగా తెరకెక్కే ఈ సినిమా జాన్వీ కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్‌లో దేవర సక్సెస్ అయితేనే, జాన్వీకి వెల్కమింగ్ ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రెడీ చెర్రీ సినిమా సైన్ చేసినప్పటికీ, ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ సెంటిమెంట్, ఆ తర్వాతి ప్రాజెక్టుల మీద ఇంపాక్ట్ చూపిస్తుందన్నది ఓపెన్ ఫ్యాక్ట్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవర సూపర్‌సక్సెస్ కావాలని మొక్కుకుంటున్నారట జాన్వీ.

త్రిష షేర్ చేసిన థగ్‌లైఫ్ షూటింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా థగ్‌లైఫ్. మణిరత్నం డైరక్ట్ చేస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు మణిరత్నం. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. త్రిష సెట్లో జాయిన్ అయ్యారు. జయం రవి త్వరలోనే షూటింగ్‌కి హాజరవుతారు. డేస్ లైక్ టుడే అంటూ చేస్తున్న పనిమీద తనకున్న ప్రేమను ఎమోజీస్‌తో షేర్ చేసుకున్నారు త్రిష. మణిరత్నంతో వరుసగా ఆమె చేస్తున్న థర్డ్ ప్రాజెక్ట్ ఇది.




