నార్త్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సినిమాలే చేతినిండా ఉన్నాయని గతంలో చాలా సార్లు చెప్పారు నయన్. అయితే ఆఫర్, అట్లీ నుంచి వచ్చేసరికి, అందులోనూ షారుఖ్ హీరో అనేసరికి, నో చెప్పలేకపోయారు. ఎందుకంటే, హిందీలో నయన్ చూడని సినిమాలు అసలు ఉండవంటే నమ్మాల్సిందేనట. బాలీవుడ్ ప్రాజెక్టుల మీద అంత గ్రిప్ ఉంటుందట నయన్‌కి. అందులోనూ ఆమె షారుఖ్‌కి అతి పెద్ద ఫ్యాన్. అందుకే జవాన్‌లో ఆమె నటిస్తున్నారన్నప్పుడు నార్త్ నుంచి కూడా వార్మ్ వెల్కమ్ లభించింది. ఇప్పుడు ఆమె నిర్ణయానికి ప్రాపర్ అక్రిడేషన్ లభించినట్టయింది. లేటెస్ట్ గా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకున్నారు నయన్. అవార్డుల స్టేజ్ మీద ఎల్లో శారీలో గోల్డెన్ దివా అనిపించారు నయన్.