- Telugu News Photo Gallery Cinema photos Senior heroines say that even if the offers do not come, the remuneration will not be reduced
Senior Heroines: ఆఫర్లు లేకపోతేనేమి.. రెమ్యూనరేషన్ విషయంలో తగ్గదేలే..
డిమాండ్ తక్కువున్నపుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. ఇండస్ట్రీకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మరి అదేంటి.. మన హీరోయిన్లు మాత్రం నో రిబేట్ అంటున్నారు. అవసరమైతే ఖాళీగా అయినా కూర్చుంటాం కానీ.. రెమ్యునరేషన్ తగ్గించేదిలే అంటున్నారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా.. సీనియర్లకు అంత డిమాండ్ ఏంటబ్బా తెలియక అడుగుతున్నా..? మరి అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుంటే మనసు కాస్త తేలికవుతుంది. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్.
Praveen Vadla | Edited By: Prudvi Battula
Updated on: Nov 14, 2023 | 9:31 AM

డిమాండ్ తక్కువున్నపుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. ఇండస్ట్రీకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మరి అదేంటి.. మన హీరోయిన్లు మాత్రం నో రిబేట్ అంటున్నారు. అవసరమైతే ఖాళీగా అయినా కూర్చుంటాం కానీ.. రెమ్యునరేషన్ తగ్గించేదిలే అంటున్నారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా.. సీనియర్లకు అంత డిమాండ్ ఏంటబ్బా తెలియక అడుగుతున్నా..? మరి అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుంటే మనసు కాస్త తేలికవుతుంది.

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. కాజల్, సమంత, అనుష్క, రష్మిక తీరు ఇలాగే ఉందిప్పుడు.

సాధారణంగా ఆఫర్స్ రానపుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు.. కానీ మనోళ్లు మాత్రం డిఫెరెంట్. ఖాళీగా కూర్చుంటారు తప్ప నో రిబేట్ అంటున్నారు. నయనతార ఇప్పటికీ ఒక్కో సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

సమంత అయితే తగ్గేదే లే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.20 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ.. సినిమాకు 3 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు. పైగా బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో టాలీవుడ్‌ను లైట్ తీసుకుంటున్నారు స్యామ్. మరోవైపు కాజల్ సైతం ఈ మధ్యే భగవంత్ కేసరి కోసం 2 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. రష్మిక రేంజ్ 3 కోట్లకు పైమాటే.

గతేడాది వరకు వరస సినిమాలు చేసిన పూజా హెగ్డే.. అవకాశాలు తగ్గినా సినిమాకు 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్ తర్వాత అనుష్క శెట్టి సైతం భారీగానే అందుకుంటున్నారు. ఇక శృతి హాసన్ కారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్లతో పోలిస్తే.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రీలీల, మీనాక్షి చౌదరి పారితోషికం తక్కువ.





























