ఆక్వామెన్ రాకతో ఓవర్సీస్‌లో సలార్, డంకీకి భారీ దెబ్బ తప్పదు. పైగా ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఆదరణ పెరిగింది. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇండియా వరకు ఎలాగోలా ప్రభాస్, షారుక్ మేనేజ్ చేసినా.. ఓవర్సీస్‌లో మాత్రం ఆక్వామెన్ ఆధిపత్యం భారీగానే ఉంది. ముఖ్యంగా US, UK లాంటి దేశాల్లో ఈ నీటి వీరుడితో మన హీరోలు యుద్ధం చేయాల్సిందే..!