- Telugu News Photo Gallery Cinema photos Telugu Heroines Sreeleela Vaishnavi Chaitanya Alekhya Dethadi Harika in demand for upcoming movies
Tollywood Heroines: ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు పెరిగిన డిమాండ్
ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు టైమ్ టర్న్ అయిందా..? నిన్నమొన్నటి వరకు ముంబై, మలయాళం అంటూ పక్క ఇండస్ట్రీల వైపు చూసిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు మన అమ్మాయిలనే నమ్ముకుంటున్నారా..? శ్రీలీల దూకుడుతో తెలుగమ్మాయిలకు డిమాండ్ పెరిగిందా లేదంటే బేబీ సక్సెస్‌తో మనోళ్ల టాలెంట్ బయటపడిందా..? ఉన్నట్లుండి మన బ్యూటీస్‌కు క్రేజ్ పెరగడం వెనక మతలబేంటి..? ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా కనిపిస్తుంది..? ఒకప్పుడు మన హీరోయిన్స్ అంతా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లే. కానీ మిలీనియం తర్వాత బాంబే బ్యూటీస్, చెన్నై సుందరిలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
Updated on: Oct 31, 2023 | 1:30 PM

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు టైమ్ టర్న్ అయిందా..? నిన్నమొన్నటి వరకు ముంబై, మలయాళం అంటూ పక్క ఇండస్ట్రీల వైపు చూసిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు మన అమ్మాయిలనే నమ్ముకుంటున్నారా..? శ్రీలీల దూకుడుతో తెలుగమ్మాయిలకు డిమాండ్ పెరిగిందా లేదంటే బేబీ సక్సెస్‌తో మనోళ్ల టాలెంట్ బయటపడిందా..? ఉన్నట్లుండి మన బ్యూటీస్‌కు క్రేజ్ పెరగడం వెనక మతలబేంటి..?

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా కనిపిస్తుంది..? ఒకప్పుడు మన హీరోయిన్స్ అంతా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లే. కానీ మిలీనియం తర్వాత బాంబే బ్యూటీస్, చెన్నై సుందరిలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

మధ్యలో మలయాళ కుట్టీల హవా నడిచింది. ఇన్నాళ్లకు మళ్లీ తెలుగందాలకు ఇండస్ట్రీలో మంచి రోజులొచ్చాయి. శ్రీలీల, వైష్ణవి చైతన్య ఇప్పటికే సత్తా చూపిస్తున్నారు.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో అనుమానం లేకుండా శ్రీలీల పేరే చెప్పాలి. ఈ భామ అచ్చ తెలుగమ్మాయి.. స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ప్రస్తుతం పవన్, మహేష్ బాబు నుంచి పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ వరకు ఏ హీరోను వదలకుండా అందరితోనూ జోడీ కడుతున్నారు శ్రీలీల. బేబీ తర్వాత వైష్ణవికి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.

తాజాగా యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అలేఖ్య హారిక హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. బేబీ ఫేమ్ సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. వీళ్లు కాకుండా డింపుల్ హయాతీ, ఈషా రెబ్బా లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడూ స్క్రీన్‌పై మెరుస్తున్నారు.




