పాన్ ఇండియా రేంజ్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీస్..
ఇన్నాళ్లు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే సీనియర్ హీరోయిన్లు చేసే చిన్న సినిమా అన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విమెన్ సెంట్రిక్ సినిమాల రేంజ్ కూడా మారుతోంది. కథలో దమ్ముంటే లేడీ ఓరియంటెడ్‌ను కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ సినిమాల్లో నటిస్తున్నారు.
Updated on: Aug 07, 2025 | 9:33 PM

వరుస బ్లాక్ బస్టర్స్‌తో నేషనల్ లెవల్‌లో లక్కీ బ్యూటీ ఇమేజ్ అందుకున్నారు రష్మిక మందన్న. స్టార్ హీరోల సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ భామ, ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ జానర్ మీద కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.

ఇప్పటికే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని పూర్తి చేసిన నేషనల్ క్రష్.. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న మైసా అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.

చాలా రోజులుగా లేడీ ఓరియెండెట్ జానర్‌లోనే సినిమాలు చేస్తున్న అనుష్క కూడా తన స్పాన్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీ సినిమాను నేషనల్ లెవల్‌లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఘాటీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఆల్ఫా.

ఈ సినిమాలో అలియా భట్, శార్వరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో అలియా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినా... పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఆల్ఫానే. ఈ ట్రెండ్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.




