- Telugu News Photo Gallery Cinema photos Telugu Senior Actresses like anshu genelia laya Comeback with Flops
సీనియర్ హీరోయిన్లకు కలిసిరాని రీ ఎంట్రీ
ఒకరేమో 20 ఏళ్లు.. మరొకరు 18 ఏళ్లు.. ఇంకొకరు 14 ఏళ్లు.. ఏంటిది అనుకుంటున్నారా..? మన సీనియర్ హీరోయిన్లు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి తీసుకున్న గ్యాప్..! ఎన్నో ఏళ్లుగా స్క్రీన్ మీద కనబడని వాళ్లు ఓ కథ నచ్చి ఓకే చెప్పి మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు.. కానీ ఆ కథలు ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ మధ్య ఆ ముగ్గురు సీనియర్లకు రీ ఎంట్రీ కలిసిరాలేదు.
Updated on: Aug 07, 2025 | 9:37 PM

ఒకరేమో 20 ఏళ్లు.. మరొకరు 18 ఏళ్లు.. ఇంకొకరు 14 ఏళ్లు.. ఏంటిది అనుకుంటున్నారా..? మన సీనియర్ హీరోయిన్లు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి తీసుకున్న గ్యాప్..! ఎన్నో ఏళ్లుగా స్క్రీన్ మీద కనబడని వాళ్లు ఓ కథ నచ్చి ఓకే చెప్పి మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు.. కానీ ఆ కథలు ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ మధ్య ఆ ముగ్గురు సీనియర్లకు రీ ఎంట్రీ కలిసిరాలేదు.

ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు.. ఎలాంటి సినిమాలు చేసామన్నదే గుర్తు పెట్టుకుంటారు ఆడియన్స్. అన్షు విషయంలో అదే జరిగింది. 23 ఏళ్ళ కింద ఈమె నటించిన మన్మథుడు సినిమా ఎంత సంచలనమో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నటించిన రెండు సినిమాలే అయినా అన్షు బాగానే మాయ చేసారు.. 20 ఏళ్ళ తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇచ్చిన మజాకా డిజాస్టర్ అయింది. మన్మథుడు తర్వాత సినిమాలకు దూరమైపోయారు అన్షు. హాయిగా ఫారెన్‌లో సెటిల్ అయిన ఆమె.. మజాకాతో గతేడాది రీ ఎంట్రీ ఇచ్చారు.. కానీ ఆమె ఆశలను ముంచేసింది ఈ చిత్రం.

అలాగే లయ కూడా అంతే. 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటించారు. కానీ సినిమా వచ్చిపోయిన సంగతి కూడా ఎవరికీ గుర్తులేదు. ఏ విధంగానూ తమ్ముడు సినిమా లయ రీ ఎంట్రీకి హెల్ప్ అవ్వలేదు.

రీ ఎంట్రీలో భంగపడ్డ మరో హీరోయిన్ జెనిలియా. నార్త్‌లో నటిస్తున్నా.. సౌత్‌లో మాత్రం పుష్కర కాలంగా కనిపించట్లేదు ఈమె. కిరీటీ జూనియర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జెన్నీకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. మొత్తానికి భారీ ఆశలతో రీ ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు సీనియర్లకు నిరాశే ఎదురైంది.