- Telugu News Photo Gallery Cinema photos Ram charans fans travel 231 km for 4 days to meet him actor greets them with hugs
Ram Charan: రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్.. వారిని హత్తుకున్న మెగా పవర్ స్టార్
దాదాపు 231 కిలో మీటర్ల దూరం నుంచి తనను కలిసేందుకు వచ్చిన అభిమానుల్ని పలకరించారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.
Updated on: Jun 25, 2021 | 5:17 PM

దాదాపు 231 కిలో మీటర్ల దూరం నుంచి తనను కలిసేందుకు వచ్చిన అభిమానుల్ని పలకరించారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోసం ఆయన అభిమానులు దాదాపు 231 కిలోమీటర్లు నడిచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్ వారిని కలిసి తన మంచితనాన్ని చాటుకున్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడారు.

చరణ్ అంటే ఇష్టంతో ఆయన అభిమానులు సంధ్యా రాజ్, రవి, వీరేశ్ హైదరాబాద్‌కు వచ్చారు. జోగులాంబ గద్వాల నుంచి దాదాపు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వీరు చరణ్ ఇంటికి చేరుకున్నారు.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు మొదటి సినిమా నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెర అరంగేట్రం చేసినా.. మొదటి చిత్రం 'చిరుత'తోనే తానేంటో నిరూపించుకున్నారు.

ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆచార్య మూవీలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.




