- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth vs Vijay Thalapathy comparison in Tamil cinema industry including remuneration
తలైవా వెర్సస్ దళపతి.. ఎవరిది పైచేయి ?? తేల్చేసిన లెక్కలు..
మనలో మన మాట.. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు..? రజినీకాంత్ ఉండగా.. ఈ ప్రశ్న అడుగుతున్నారా అని కోపం వస్తుంది కదా..! కానీ ఏం చేస్తాం.. కొన్నిసార్లు ఎవరి స్థానమేంటో చెప్పడానికి మనుషుల కంటే ఎక్కువగా లెక్కలే మాట్లాడుతుంటాయి.. అందులో ఒప్పుకోలేని నిజాలుంటాయి. విజయ్, రజినీ రెమ్యునరేషన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి ఆ లెక్కలేంటో చూద్దామా..? అవును.. మొనగాడు ఒక్కడే ఉంటాడు.. ఆ మొనగాడు రజినీ అవుతాడు అంటున్నారు ఫ్యాన్స్.
Updated on: Apr 29, 2024 | 1:50 PM

మనలో మన మాట.. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు..? రజినీకాంత్ ఉండగా.. ఈ ప్రశ్న అడుగుతున్నారా అని కోపం వస్తుంది కదా..! కానీ ఏం చేస్తాం.. కొన్నిసార్లు ఎవరి స్థానమేంటో చెప్పడానికి మనుషుల కంటే ఎక్కువగా లెక్కలే మాట్లాడుతుంటాయి.. అందులో ఒప్పుకోలేని నిజాలుంటాయి.

విజయ్, రజినీ రెమ్యునరేషన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి ఆ లెక్కలేంటో చూద్దామా..? అవును.. మొనగాడు ఒక్కడే ఉంటాడు.. ఆ మొనగాడు రజినీ అవుతాడు అంటున్నారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నెంబర్ వన్ చైర్ గురించి ఎవరూ మాట్లాడరు.. మాట్లాడే ధైర్యం కూడా చేయరు.

ఆయన తర్వాత స్థానం కోసమే పోటీ అంతా. 45 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీపై రజినీ వేసిన ముద్ర అలా ఉంది మరి. ఇప్పటికీ వరస సినిమాలతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. జైలర్‌తో ఫామ్‌లోకి వచ్చిన రజినీ.. వరస సినిమాలతో జోరు పెంచేసారు.

జ్ఞానవేల్‌తో వెట్టైయాన్, లోకేష్ కనకరాజ్‌తో కూలీ సినిమాలకు కమిటయ్యారు. ఇందులో వెట్టైయాన్ షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. త్వరలోనే కూలీ మొదలు కానుంది. కూలీ సినిమా కోసం రజినీకాంత్ ఏకంగా 260 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరోవైపు రజినీకి విజయ్ పోటీ ఇస్తున్నారు. లియోకు 170 కోట్ల పారితోషికం అందుకున్న విజయ్.. ప్రస్తుతం నటిస్తున్న గోట్ కోసం 200 కోట్ల మార్క్ టచ్ చేసారు. త్వరలోనే దళపతి 69 కోసం 250 కోట్లు కోట్ చేస్తున్నారు విజయ్. ఇప్పుడు ఈ మార్క్ రజినీ కూలీతో దాటేస్తున్నారు. మొత్తానికి కలెక్షన్లే కాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ రజినీ, విజయ్ మధ్య పోటీ ఆసక్తికరంగా నడుస్తుంది.




