- Telugu News Photo Gallery Cinema photos Assistant directors who worked with Sukumar have become good telugu movie directors now
Sukumar: లెక్కల మాస్టారా.. మజాకానా !! శిష్యుల ట్రాక్ రికార్డు చూస్తే..
శిష్యుడు విజయం సాధించడం కంటే గురువుకు గొప్ప ఆనందం ఏముంటుంది చెప్పండి..? ఇప్పుడు సుకుమార్ ఈ ఆనందాన్ని టన్నుల్లో అనుభవిస్తున్నారు. తాజాగా ఈయన స్కూల్ నుంచి మరొకరు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు. మరి కొత్తగా వచ్చే దర్శకుడు ఏం చేయబోతున్నారు..? ఆయనే సినిమాతో వస్తున్నారు..? ఇప్పుడు మీరు చూసిన ఈ మాంటేజ్‌లో ఏ సినిమాకు మరో దానితో సంబంధం లేదు.
Updated on: Apr 29, 2024 | 2:28 PM

శిష్యుడు విజయం సాధించడం కంటే గురువుకు గొప్ప ఆనందం ఏముంటుంది చెప్పండి..? ఇప్పుడు సుకుమార్ ఈ ఆనందాన్ని టన్నుల్లో అనుభవిస్తున్నారు. తాజాగా ఈయన స్కూల్ నుంచి మరొకరు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు.

మరి కొత్తగా వచ్చే దర్శకుడు ఏం చేయబోతున్నారు..? ఆయనే సినిమాతో వస్తున్నారు..? ఇప్పుడు మీరు చూసిన ఈ మాంటేజ్‌లో ఏ సినిమాకు మరో దానితో సంబంధం లేదు. కానీ అన్నింటినీ కలిపే కామన్ పాయింట్ మాత్రం ఒకటుంది.. అదే సుకుమార్.

ఈ సినిమాలన్నీ తెరకెక్కించింది సుక్కు శిష్యులే. గతేడాది విరూపాక్షతో కార్తిక్ దండు, దసరాతో శ్రీకాంత్ ఓదెల.. దానికి ముందు ఉప్పెనతో బుచ్చిబాబు తొలి అడుగులోనే విజయం సాధించారు. సుకుమార్ శిష్యులకు తెలుగు ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయింది.

లెక్కల మాస్టారు స్కూల్ నుంచి వచ్చారంటే చాలు.. నిర్మాతలు ఎంత ఖర్చైనా ఓకే అంటున్నారు. దీనికి బుచ్చిబాబే నిదర్శనం. తాజాగా అర్జున్ అనే మరో దర్శకుడు.. సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్నారు. ఈయన తెరకెక్కిస్తున్న ప్రసన్న వదనం మే 3న విడుదల కానుంది. సుహాస్ ఇందులో హీరో.

ఫేస్ బ్లైండ్ నెస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రసన్న వదనం సినిమా వస్తుంది. ఇందులో హీరోకు మొహం గుర్తు పట్టలేని జబ్బు ఉంటుంది. అలాంటి వాడు మర్డర్ కేసులో ఇరుక్కుంటే పరిస్థితేంటనేది కథ. ప్రీ రిలీజ్ వేడుకలో శిష్యుడు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు సుక్కు. మరి చూడాలిక.. బుచ్చిబాబు, శ్రీకాంత్, కార్తిక్ దండు మాదిరే అర్జున్ కూడా సుకుమార్ పేరు నిలబెడతారో లేదో..?




