Rajeev Rayala |
Updated on: Apr 29, 2024 | 8:34 PM
శ్రియ రెడ్డి.. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా .. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది.
శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది.
ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం సలార్ 2 లో నటిస్తుంది శ్రియ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ చిన్నది. వయసు పెరిగినా తరగని అందంతో ఆకట్టుకుంటుంది.
తాజాగా బ్లాక్ బ్లాక్ కలర్ డ్రస్ లో అందాలు ఆరబోసింది శ్రియ రెడ్డి. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.