- Telugu News Photo Gallery Cinema photos Prashanth neel Prabhas Salaar Movie huge response after bahubali details here Telugu Entertainment Photos
Prabhas – Salaar: పదేళ్లుగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కు ఊపిరి పోసిన ప్రశాంత్ సలార్.
డార్లింగ్ ప్రభాస్‌ను ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాగే తెర మీద ప్రజెంట్ చేశారు ప్రశాంత్ నీల్. దాదాపు పదేళ్లుగా డార్లింగ్ మాస్ హీరోయిజాన్ని మిస్ అయిన ఫ్యాన్స్, సలార్ రిలీజ్‌తో ఊపిరిపీల్చుకున్నారు. బాహుబలి తరువాత బిగ్ హిట్ ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కల సలార్‌తో నెరవేరింది. ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసి పదేళ్లు అవుతోంది. చివరగా మిర్చి సినిమాలో మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు డార్లింగ్.
Updated on: Dec 23, 2023 | 6:47 PM

డార్లింగ్ ప్రభాస్‌ను ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాగే తెర మీద ప్రజెంట్ చేశారు ప్రశాంత్ నీల్. దాదాపు పదేళ్లుగా డార్లింగ్ మాస్ హీరోయిజాన్ని మిస్ అయిన ఫ్యాన్స్, సలార్ రిలీజ్‌తో ఊపిరిపీల్చుకున్నారు.

బాహుబలి తరువాత బిగ్ హిట్ ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కల సలార్‌తో నెరవేరింది. ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసి పదేళ్లు అవుతోంది. చివరగా మిర్చి సినిమాలో మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు డార్లింగ్.

ఆ తరువాత బాహుబలితో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్, నేషనల్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. బాహుబలి సక్సెస్ తరువాత ప్రభాస్ కటౌట్‌కు తగ్గ మాస్ మూవీ మళ్లీ పడలేదు. సాహో సక్సెస్ అయినా, స్టైలిష్ మూవీ కావటంతో సౌత్ ఆడియన్స్ పెద్దగా సాటిస్‌ఫై కాలేదు.

ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ జానర్ మూవీసే కావటంతో, డార్లింగ్ కాంపౌండ్ నుంచి సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్‌తో ఆ కోరిక తీరిందంటున్నారు ఫ్యాన్స్.

ఇన్నేళ్లుగా ప్రభాస్‌ను తెర మీద ఎలా చూడాలనుకుంటున్నామో, ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్‌గా అలాగే చూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ కటౌట్‌కు సాలిడ్ మాస్ యాక్షన్ కథ పడితే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో సలార్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

రిలీజ్‌కు ముందు నుంచే నేషనల్ లెవల్‌లో సలార్ మేనియా పీక్స్‌లో ఉంది. తెర మీద ఆ అంచనాలకు తగ్గ కంటెంట్ కనిపించటంతో పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతున్నారు ఫ్యాన్స్. పదేళ్ల ఆకలి తీరిందంటూ పండగ చేసుకుంటున్నారు.




