- Telugu News Photo Gallery Cinema photos Heroine Sreeleela Hopes in Guntur karam Movie in Tollywood Telugu Actress Photos
Sreeleela: సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా శ్రీలీల.. చాలా ఆశలు పెట్టుకున్న అమ్మడు.
ఒక్క సారి గ్లామర్ వరల్డ్‌లోకి ఎంటర్ అయితే పర్సనల్ లైఫ్‌ను త్యాగం చేయక తప్పదు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌నే ఫేస్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. బిజియస్ట్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ అప్‌కమింగ్ సినిమా కోసం తన ఎకడమిక్స్‌ను కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అయినా సినిమా కోసం అన్నింటికీ ఒకే అంటున్నారు శ్రీలీల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల, ఆ సినిమా కోసం తన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌ను పక్కన పెట్టేశారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 23, 2023 | 7:43 PM

ఒక్క సారి గ్లామర్ వరల్డ్‌లోకి ఎంటర్ అయితే పర్సనల్ లైఫ్‌ను త్యాగం చేయక తప్పదు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌నే ఫేస్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. బిజియస్ట్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ అప్‌కమింగ్ సినిమా కోసం తన ఎకడమిక్స్‌ను కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

అయినా సినిమా కోసం అన్నింటికీ ఒకే అంటున్నారు శ్రీలీల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల, ఆ సినిమా కోసం తన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌ను పక్కన పెట్టేశారు.

డేట్స్ విషయంలో అడ్జెస్ట్‌మెంట్ కుదరకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలీల షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తున్నారన్న టాక్ వినిపించింది. బెంగళూరులో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారని, షార్ట్ బ్రేక్ తరువాత తిరిగి షూటింగ్‌లకు హాజరవుతారన్న ప్రచారం జరిగింది.

కానీ షూటింగ్ కోసం ఎకడమిక్స్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు శ్రీలీల. గుంటూరు కారం సినిమా కోసం ఓ సాంగ్ పూర్తి చేయాల్సి రావటంతో తిరిగి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు శ్రీలీల. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది ఈ మూవీ.

రిలీజ్‌కు పెద్దగా టైమ్ లేకపోవటంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువగా టైమ్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఈ బ్యూటీ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరుకారం.

ఈ సినిమాలో చాలా రోజులు తరువాత అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మహేష్. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద శ్రీలీల కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.





























