- Telugu News Photo Gallery Cinema photos Rowdy Boy Vijay Devarakonda Police role in his next Movie with gowtam tinnanuri details here
Vijay Devarakonda: వరస సినిమాలు లైన్లో పెట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.! పోలీస్ గా ఫస్ట్ టైం.
మూవీ అప్‌డేట్స్ ఇవ్వకపోయినా... లేటెస్ట్ లుక్స్‌తో టీజ్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్‌గా ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన రౌడీ బాయ్, ఆ ఫోటోస్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ స్టార్ అప్‌డేట్స్ కూడా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో విజయ్ దేవరకొండ న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు.
Updated on: Dec 23, 2023 | 6:46 PM

మూవీ అప్‌డేట్స్ ఇవ్వకపోయినా... లేటెస్ట్ లుక్స్‌తో టీజ్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్‌గా ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన రౌడీ బాయ్, ఆ ఫోటోస్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

అదే సమయంలో ఫ్యామిలీ స్టార్ అప్‌డేట్స్ కూడా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో విజయ్ దేవరకొండ న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు.

రెస్టారెంట్, కాపీషాప్‌లో రౌడీ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోస్‌తో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమా స్టేటస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్.

న్యూయార్క్‌లో షార్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన ఫ్యామిలీ స్టార్ టీమ్, నెక్ట్స్ ముంబైలో మరో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్తవుతుంది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసిన మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ పూర్తయిన వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో మూవీని లైన్‌లో పెట్టేస్తున్నారు విజయ్.

ఆల్రెడీ అఫీషియల్‌గా ఎనౌన్స్ అయిన గౌతమ్ తిన్ననూరి సినిమాను ఫిబ్రవరిలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు విజయ్ దేరకొండ.




