- Telugu News Photo Gallery Cinema photos Prashant Neel ends the suspense, gives update on KGF Chapter 3
KGF Chapter 3: సస్పెన్స్‌కు తెర తీసిన ప్రశాంత్ నీల్.. కేజియఫ్ 3పై క్రేజీ అప్‌డేట్
అనుకున్నదొక్కటి.. అక్కడ జరుగుతున్నది మరొకటి. యష్ 19 గురించి అప్‌డేట్స్ అడుగుతుంటే.. అనుకోకుండా కేజియఫ్ 3పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. పైగా క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో ప్రశాంత్ నీల్ మాస్టర్.. అందుకే మరోసారి ఇదే చేస్తున్నారీయన. కేజియఫ్ 3పై ఎప్పట్నుంచో ఉన్న సస్పెన్స్‌కు తెర తీసారు. మరింతకీ పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? రాఖీ భాయ్ రాక ఎప్పుడు..? ఓ సినిమా విడుదలయ్యాక.. మహా అయితే ఆర్నెళ్లు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఏడాదన్నరైనా దానిపై అంతే క్రేజ్ ఉందంటే మాత్రం.. అది కచ్చితంగా అద్భుతమే. అలాంటి మ్యాజిక్ కేజియఫ్‌తో చేసారు ప్రశాంత్ నీల్.
Updated on: Dec 12, 2023 | 6:20 PM

అనుకున్నదొక్కటి.. అక్కడ జరుగుతున్నది మరొకటి. యష్ 19 గురించి అప్‌డేట్స్ అడుగుతుంటే.. అనుకోకుండా కేజియఫ్ 3పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. పైగా క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో ప్రశాంత్ నీల్ మాస్టర్.. అందుకే మరోసారి ఇదే చేస్తున్నారీయన. కేజియఫ్ 3పై ఎప్పట్నుంచో ఉన్న సస్పెన్స్‌కు తెర తీసారు. మరింతకీ పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? రాఖీ భాయ్ రాక ఎప్పుడు..?

ఓ సినిమా విడుదలయ్యాక.. మహా అయితే ఆర్నెళ్లు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఏడాదన్నరైనా దానిపై అంతే క్రేజ్ ఉందంటే మాత్రం.. అది కచ్చితంగా అద్భుతమే. అలాంటి మ్యాజిక్ కేజియఫ్‌తో చేసారు ప్రశాంత్ నీల్. ఎప్రిల్ 14, 2022న విడుదలైన ఈ చిత్రం.. ఏడాదిన్నర అయినా కూడా వార్తల్లోనే ఉంది. అందులోనూ పార్ట్ 3కి సంబంధించిన అప్‌డేట్ గురించి ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

కేజియఫ్ 3 ఉందని గతేడాదే ప్రకటించారు దర్శక నిర్మాతలు. 1978 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఎక్కడున్నారు అనేది ఇందులో లైన్ అని.. 181 దేశాల్లో ఆయన చేసిన క్రైమ్స్‌తోనే పార్ట్ 3 ఉంటుందని లీడ్ ఇచ్చారు. తాజాగా కేజియఫ్ 3పై మరో అప్‌డేట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. దాంతో పార్ట్ 3కి ముహూర్తం సెట్ అయిందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

కేజియఫ్ 2 వచ్చి ఏడాదన్నరైనా.. ఇప్పటికీ యష్ మరో సినిమా మొదలు పెట్టలేదు. డిసెంబర్ రెండో వారంలో ఆయన కొత్త సినిమా షురూ కానుంది. మరోవైపు కేజియఫ్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేసారు ప్రశాంత్ నీల్. దీనికి స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిందని.. అయితే దానికి దర్శకుడు తానుంటారా.. మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియదంటున్నారు ప్రశాంత్ నీల్.

కేజియఫ్ 3కి ప్రశాంత్ నీల్ దర్శకుడుగా ఉండకపోతే మాత్రం ప్రాజెక్ట్‌కు అంత క్రేజ్ రాదు. అయితే దర్శకుడిగా తాను ఉన్నా లేకపోయినా యష్ మాత్రం ఉంటారని తేల్చేసారు ప్రశాంత్. అదిప్పుడు ఉంటుందా.. తర్వాత తెరకెక్కుతుందా అనేది మాత్రం సస్పెన్స్. కాస్త లేటైనా రాఖీ భాయ్ మళ్లీ రావడం మాత్రం పక్కా. ఆ మధ్య విడుదలైన కేజియఫ్ 2 వన్ ఇయర్ ట్రైలర్‌లోనూ పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు మేకర్స్.




