Mansoor Ali Khan : మన్సూర్‌ను తిట్టిపోసిన మద్రాస్ హై కోర్టు.. పిచ్చి వేషాలు వేయకుండా..

రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ నటుడు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని... సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నాడు. దాదాపు రూ.కోటి డిమాండ్‌ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

Rajeev Rayala

|

Updated on: Dec 12, 2023 | 8:29 PM

మన్సూర్ అలీ ఖాన్... ఇప్పుడు అటు కోలివుడ్‌లో... ఇటు టాలివుడ్‌లో తెగ్ ట్రెండ్ అవుతున్న పేరు. తాజాగా త్రిష, చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. కోర్టు తిరిగి ఆయనకే మొట్టి కాయలు వేసింది. అసలు కేసు పెట్టాల్సింది మీ మీద కదా అని వ్యాఖ్యానించింది. దీంతో ఓ రకంగా ఈ వివాదానికి సరైన ముగింపు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

1 / 9
అసలు ఇంతకీ ఏంటీ వివాదం... గడిచిన నెలన్నర రోజులుగా ఏం జరిగింది. లియో.. వల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైబడి కలక్షన్స్‌తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ. నిజానికి మన్సూర్ అలీఖాన్ వివాదానికి ఈ మూవీయే సెంటర్ పాయింట్.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాల్లో విలన్లలో ఒకరైన మన్సూర్ .. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన త్రిషపై చేసిన కామెంట్స్ యావత్ సిని ఇండస్ట్రీలో కలకలం రేపాయి.

2 / 9
త్రిషను ఉద్ధేశిస్తూ మన్సూర్ చేసిన చిల్లర వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు త్రిష. అసలు అలాంటి వ్యక్తితో ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకోనందుకు సంతోషిస్తున్నానని.. భవిష్యత్తులో ఎప్పుడు అలాంటి తప్పు చేయనని స్పష్టం చేశారు.త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్‌తో... ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. మన్సూర్ పై తీవ్రంగా మండిపడింది.

3 / 9
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి త్రిషకు మద్దతుగా నిలిచారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తంగా ఈ వ్యవహారం ముదురు పాకన పడటంతో మొదట్లో తన వ్యాఖ్యల్లో తప్పేం లేదని బలంగా చెప్పిన మన్సూర్ చివరకు దిగొచ్చాడు. త్రిషకు సారీ చెప్పాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్నారు చాలామంది. అయితే మన్సూర్‌ మళ్లీ గొడవను రాజేశాడు.

4 / 9
రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ నటుడు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని... సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నాడు. దాదాపు రూ.కోటి డిమాండ్‌ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ నటుడు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని... సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నాడు. దాదాపు రూ.కోటి డిమాండ్‌ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

5 / 9
తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మన్సూర్‌కి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చింది. అసలు మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది. ప్రతిసారి ఏదో ఒక విషయంపై వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడిని అనడం మీకు బాగా పరిపాటిగా మారింది. పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో హీనమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ముందుగా త్రిష నీపై కేసు పెట్టాలి. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకో’ అంటూ మన్సూర్‌ను తిట్టిపోసింది మద్రాస్ హై కోర్టు. అంతేకాదు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలకు సంబంధించిన అన్ కట్ వీడియో వీడియోను సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి మన్సూర్‌ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు.

6 / 9
దీంతో అన్‌ కట్‌ వీడియోను సమర్పిస్తామని మన్సూర్ తరపు న్యాయవాది అంగీకరించారు. అయితే మన్సూర్‌పై త్రిష సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా ఈ కేసులో తమ వాదనలు సమర్పించాలని ఆదేశించారు.తదుపరి విచారణను డిసెంబరు 22కి వాయిదా వేశారు.

7 / 9
ఇక మన్సూర్ విషయానికొస్తే.. కోర్టు చెప్పినట్టు ఈ పెద్ద మనిషికి వివాదాలు కొత్తేం కాదు. కొన్ని సార్లు ఆయనపై వేసిన నిందలు తప్పని కూడా కోర్టుల్లో రుజువైంది. అత్యాచారం నేరారోపణల మీద మార్చి 27, 2001 సెషన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత 2012లో అతనిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మద్రాస్ హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. 2012 జనవరిలో అరుంబాక్కంలో 16 అంతస్థుల ఆస్తిని అక్రమంగా నిర్మించారని ఆరోపించిన తరువాత, భూమి కబ్జా ఆరోపణలపై ఖాన్‌ను అరెస్టు చేశారు. కోవిడ్ వ్యాక్సీన్ గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్నారంటూ 2021 ఏప్రిల్లో ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి 2 లక్షలు చెల్లించాలని కూడా మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

8 / 9
ఇక సినీ ఇండస్ట్రీలో హిరోయిన్లపై ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసి గతంలో కూడా చాలా మంది నటులు చిక్కుల్లో పడ్డారు. అయితే అప్పట్లో సామాజిక మాధ్యమాల వినియోగం పెద్దగా ఉండకపోవడం.. మీడియా ఫోకస్ కూడా ఇప్పుడున్నంత ఉండకపోవడం.... వల్ల అవేవీ పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ మన్సూర్ విషయంలో అలా జరగలేదు. జనం అప్పుడున్నంత స్తబ్దుగా ఇప్పుడు లేరు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన తర్వాత ఎవ్వరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకుండా... ఇష్టం వచ్చినట్టు వాగితే.. ఇదుగో ఇలాగే ఉంటుంది.

9 / 9
Follow us