Hi Nanna: నాని ఖాతాలో మరో “మిలియన్” మార్క్.. ఓవర్సీస్‌లో టాప్ లేపుతున్న హాయ్ నాన్న
చల్లగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటుంటారు నాని. ఎంతమంది హీరోలున్నా.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆ ఒక్క ఏరియాలో మాత్రం మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయారు న్యాచురల్ స్టార్. ఇంట గెలిచినా ఓడినా.. రచ్చ మాత్రం ప్రతీసారి గెలుస్తూనే ఉన్నారీయన. తాజాగా హాయ్ నాన్నతో మరోసారి ఓవర్సీస్‌లో టాప్ లేపేస్తున్నారు నాని. పక్కింటి అబ్బాయిలా కనిపించే నానిని చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. పైగా ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. టాక్‌తో సంబంధం లేకుండా నాని సినిమా చూడాలనుకునే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
