Telugu Movies: గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది.. లాంగ్ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు..
అల వైకుంఠపురములో సినిమా టైమ్‌లో ఫస్ట్ టీజర్‌లోనే ఓ డైలాగ్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ అప్పట్లో సిచ్యుయేషన్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే మాటను గుర్తు చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ఒక్క బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులందరిదీ అదే సిచ్యుయేషన్.
Updated on: Dec 12, 2023 | 3:10 PM

అల వైకుంఠపురములో సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే పుష్పరాజ్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన బన్నీ, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. పుష్ప మూవీ పాన్ ఇండియా రేంజ్ సెన్సేషన్ కావటంతో సీక్వెల్ విషయంలో ఎలర్ట్ అయ్యింది మూవీ టీమ్. కంటెంట్ నుంచి క్వాలిటీ వరకు ప్రతీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేందుకు ఇంకాస్త టైమ్ తీసుకున్నారు మేకర్స్. దీంతో మరోసారి బన్నీ కెరీర్‌లో గ్యాప్ వచ్చింది.

ట్రిపులార్‌తో ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన తారక్, చరణ్‌కి కూడా లాంగ్ బ్రేక్ తప్పలేదు. ట్రిపులార్ కోసమే రెండేళ్లకు పైగా వర్క్ చేసిన ఇద్దరు స్టార్స్, ఆ తరువాత మరో మూవీని రిలీజ్ చేయడానికి మరింత టైమ్ తీసుకుంటున్నారు. గేమ్ చేంజర్ వర్క్ డిలే అవుతుండటం, దేవర షూటింగ్ స్టార్ట్ చేసేందుకే తారక్ చాలా టైమ్ తీసుకోవటంతో ఇద్దరు హీరోలకు 2023లో రిలీజ్ లేకుండా పోయింది.

సర్కారువారి పాట సక్సెస్ తరువాత వెంటనే త్రివిక్రమ్ కెప్టెన్సీలో గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేసిన మహేష్, నెమ్మదిగా షూటింగ్ చేస్తున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ ఆ టార్గెట్‌తోనే షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. దీంతో మహేష్ మూవీ క్యాలెండర్‌లో 2023 స్కిప్ అయ్యింది.

సీనియర్ హీరోల కెరీర్‌లోనూ 2023 బ్లాంక్ ఇయర్‌గానే కనిపిస్తోంది. ఈ ఏడాది చిరు, బాలయ్య లాంటి స్టార్స్ రెండు రిలీజ్‌లతో సదండి చేస్తే, వెంకీ, నాగ్ మాత్రం అస్సలు కనిపించలేదు. ఎఫ్ 3 ఫెయిల్యూర్ తరువాత నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేసేందుకు వెంకీ టైమ్ తీసుకున్నారు.

వరుస ఫ్లాప్‌లతో డైలామాలో పడ్డ నాగ్ కూడా నా సామి రంగకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. దీంతో ఈ ఇద్దరు హీరోల కెరీర్‌లో 2023 బ్లాంక్ ఇయర్‌గానే మిగిలిపోయింది. ఈ ఏడాది మిస్ అయినా, 2024 మాత్రం మోర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందంటున్నారు టాలీవుడ్ స్టార్స్.




