Ananya Nagalla: చీరకట్టులో చక్కనమ్మ.. అనన్య ఎంత ముద్దుగుందో..
మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అనన్య నాగళ్ళ. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అనన్య . ఆతర్వాత ఈ చిన్నది ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది అనన్య.
Updated on: Dec 13, 2023 | 1:14 PM

మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అనన్య నాగళ్ళ. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అనన్య .

ఆతర్వాత ఈ చిన్నది ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది అనన్య.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది అనన్య. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

వకీల్ సాబ్ తర్వాత అనన్యకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ అమ్మడు ఆతర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు అందుకోలేకపోయింది.

ఇటీవలే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో అభిమానులను కవ్విస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది చీర కట్టులో కొన్ని ఫోటోలను పంచుకుంది.




