- Telugu News Photo Gallery Cinema photos Prabhas Rajasaab special song to Heroine Keerthy Suresh wedding latest movie news from film industry
Movie Updates: రాజాసాబ్ స్పెషల్ సాంగ్ అప్డేట్.. కీర్తీ పెళ్లి ముహూర్తం ఫిక్స్..
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా రాజా సాబ్ నుంచి నయా అప్డేట్. కీర్తీ సురేష్ త్వరలోనే పెళ్లి ముహూర్తం కుదిరింది. పుష్ప2 గురించి మెగాస్టార్. నవ్వులు పంచే డిటెక్టివ్ రోల్ చేయడానికి రెడీ అయ్యారు మలయాళ కథానాయకుడు మమ్ముట్టి. మనోజ్ బాజ్‌పేయి హీరోగా నటించిన సినిమా డిస్పాచ్. ఇలాంటి సినిమా అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Dec 07, 2024 | 1:42 PM

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా పూర్తయ్యే స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం నయనతార ఆడిపాడుతారని సమాచారం. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల్లో గానీ నయన్ ఈ సినిమా కోసం కాల్షీట్లు ఇస్తారట.

కీర్తీ సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఆమె చిరకాల స్నేహితుడు ఆంటోనీతో ఏడడుగులు నడవబోతున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. నెట్టింట్లో ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. 15 ఏళ్లుగా సాగుతున్న బంధం, జీవితకాలం కంటిన్యూ అవుతుందని చెప్పారు కీర్తీ సురేష్. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు ఈ జంట.

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీఈఓ చెర్రీ.. వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. పుష్ప2 విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్.

నవ్వులు పంచే డిటెక్టివ్ రోల్ చేయడానికి రెడీ అయ్యారు మలయాళ కథానాయకుడు మమ్ముట్టి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. డొమినిక్ అనే రోల్‌లో కనిపిస్తారు మమ్ముట్టి.

మనోజ్ బాజ్‌పేయి హీరోగా నటించిన సినిమా డిస్పాచ్. క్రైమ్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. దేశాన్ని కుదిపేసిన అతి పెద్ద కుంభకోణంలోని రహస్యాలను వెలికితీసే పాత్రికేయుడి పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు మనోజ్ బాజ్‌పేయి. ట్రైలర్ మెప్పిస్తోంది.





























